డ్యూటీ సరిగ్గా చేయాలన్నందుకు తండ్రినే చంపేశాడు

గోదావరిఖని, వెలుగు: ఉద్యోగం సరిగ్గా చేయమని మందలించినందుకు తండ్రినే చంపేశాడా కొడుకు. ఈ ఘటన శనివారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోజరిగింది. గోదా-
వరిఖని తిలక్‌‌‌‌నగర్‌‌‌‌ డౌన్‌‌‌లో నివాసముండే ఆడెపు బాపు అలియాస్‌‌‌‌ కొలిపాక రాజేశం(63) భూపాలపల్లి జిల్లాలో ని సింగరేణి గనిలో కార్మికుడిగా పనిచేశారు. నాలుగేళ్ల క్రితం మెడికల్‌‌‌‌ అన్‌‌‌‌ఫిట్‌‌‌‌ కావడంతో అతని చిన్న కొడుకు బుచ్చి బాబును ఆయన స్థానంలో పనిలో పెట్టించారు. అతను జీడికె 11ఏ గని నుంచి డిప్యుటేషన్‌‌‌‌పై ఏఎల్‌‌పీ గనిలో పని చేస్తున్నాడు. అయితే మద్యానికి బానిసై డ్యూటీ సరిగా చేయకపోవడంతో ఆందోళన చెందిన రాజేశం కొడుకుపై ఆగ్రహం వ్యక్తం చేశాడు.దాంతో బుచ్చి బాబు ఇనుప రాడ్‌‌‌‌తో తండ్రి తలపై గట్టిగా కొట్టాడు. రక్తం ఎక్కువగా పోవడంతో రాజేశం అక్కడికక్కడే చనిపోయాడు. బయటకు వచ్చిన బుచ్చి బాబు తన తండ్రి ఫిట్స్‌‌‌‌తో కిం దపడి చనిపోయాడని చుట్టుపక్కల వారిని నమ్మించాడు. మృతదేహాన్ని పోస్ట్‌‌‌‌మార్టం‌‌ కోసం హాస్పి టల్‌‌‌‌కు తీసుకెళ్లగా డాక్టర్లు, పోలీసులకు అనుమానం వచ్చి మృతుడి తలను నీళ్లతో కడిగి పరిశీలించారు. బలమైన ఆయుధంతో కొట్టినట్టు గుర్తించారు. కొడుకును అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయటపడింది.

Latest Updates