పుల్వామా ఉగ్రదాడికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చి తీరుతాం : పీఎం మోడీ

ఢిల్లీ: పుల్వామా ఎటాక్ లో అమరులైన భారత సైనికులకు నివాళి అర్పించారు ప్రధానమంత్రి నరేంద్రమోడీ. భారత రక్షణ బలగాలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని చెప్పిన ప్రధానమంత్రి… వారు చూపే తెగువ, ధైర్యంపై తమకు అపారమైన నమ్మకం ఉందని చెప్పారు. ఈ ఉగ్ర చర్య వెనుక ఉన్న శక్తులే దీనికి బాధ్యత వహించాలని అన్నారు. కచ్చితంగా వారికి శిక్ష పడుతుందని చెప్పారు. పదునైన మాటలతో ఈ టెర్రర్ దాడిని ఖండించినందుకు దేశానికి కృతజ్ఞతలు చెప్పారు ప్రధానమంత్రి. ఈ దాడిపై దేశ ప్రజల రక్తం మరిగిపోతోందని అన్నారు. అమరుల త్యాగం ఊరికే పోదన చెప్పిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ… ఈ దాడి బాధ్యులకు గట్టి బదులు ఇచ్చి తీరుతామని చెప్పారు.

పాకిస్థాన్ ఇప్పటికే ప్రపంచదేశాల్లో ఒంటరి అయిపోయిందన్నారు ప్రధాని. దాని కుట్రలు, దుష్ట ఆలోచనలతో ఇండియాను అస్థిరపరచాలని పాక్ ప్రయత్నిస్తే గనుక ఆ దేశం పెద్ద తప్పు చేసినట్టు అవుతుందని చెప్పారు.

ఢిల్లీ-వారణాసి వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలును ఢిల్లీలో ప్రారంభించిన సందర్భంగా ప్రధాని మోడీ పుల్వామా టెర్రర్ ఎటాక్ పై స్పందించారు. ముందుగా 2 నిమిషాల మౌనం పాటించారు.

Latest Updates