తండ్రిపై కోపంతో స్కూల్ భవనం నుంచి దూకిన విద్యార్థి

సూర్యాపేట జిల్లా : తండ్రిపై కోపంతో ఏడో తరగతి విద్యార్థి స్కూల్ బిల్డింగ్ పై నుంచి దూకాడు. ఈ సంఘటన సోమవారం సూర్యాపేట జిల్లాలో జరిగింది. తుంగతుర్తి మైనార్టీ స్కూల్లో 7వ తరగతి చదువుతున్న సమీర్.. ఇటీవల పండుగకు ఇంటికి వెళ్లి.. తండ్రితో వచ్చాడు. అయితే స్కూల్ నుంచి తాను కూడా మళ్లీ ఇంటికి వస్తాననడంతో తండ్రి అందుకు అంగీకరించలేదు.

దీంతో తండ్రిపై కోపం పెంచుకున్న సమీర్.. తండ్రి సైదాబాయి ఎదుటే స్కూల్ భవనం పై నుంచి దూకాడు. వెంటనే తండ్రి సమీర్ ను ట్రీట్ మెంట్ కోసం సూర్యాపేట ప్రాంతీయ హస్పిటల్ కి తరలించాడు. బాలుడి కాలు విరిగిందని తెలిపారు డాక్టర్లు.

Latest Updates