చేతుల్నిశానిటైజర్లతో 30సెకన్లపాటు క్లీన్ చేసుకుంటే కరోనా చచ్చిపోతుంది: స్టడీ

ప్రస్తుత పరిస్థితుల్లో మనల్ని కరోనా వైరస్ నుంచి కాపాడే ఆ మూడు ఆయుధాలేనని సైంటిస్ట్ లు చెబుతున్నారు. మాస్క్ , శానిటైజర్, చేతుల్ని సబ్బుతో శుభ్రంగా క్లీన్ చేసుకోవడం . మాస్క్, చేతుల్ని సబ్బుతో క్లీన్ చేసుకోవడం పక్కనపెడితే..శానిటైజర్ తో చేతుల్ని  30సెకన్లపాటు శుభ్రం చేసుకోవడం వల్ల కరోనా వైరస్ చచ్చిపోతున్నట్లు సైంటిస్ట్ లు చెబుతున్నారు.

ఇండియా టైమ్స్ కథనం ప్రకారం .. అమెరికాకు చెందిన సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఎమర్జింగ్ ఇన్ఫెక్షియస్ డిసీజెస్ అధ్యయనం ప్రకారం శానిజైర్లు కరోనా వైరస్ ను నాశనం చేస్తున్నట్లు సదరు సంస్థ ప్రచురించిన జర్నల్ లో తెలిపింది.

ఇందుకోసం  80 శాతం ఇథనాల్ మరియు 75 శాతం ఐసోప్రొపైల్ ఆల్కహాల్ పై పరిశోధనలు చేయగా..ఆ రెండు కరోనా వైరస్ ను సమర్ధవంతంగా ఎదుర్కొన్నట్లు తేలిందని సీడీసీ తెలిపింది.

కరోనా నుంచి ప్రజల్ని కాపాడేందుకు సీడీసీ కి చెందిన సైంటిస్ట్ లు కొత్త మార్గాల్ని అన్వేషిస్తున్నారు. అన్వేషణలో భాగంగా ఆల్కాహాల్ ఉత్పత్తుల పై పరిశోధనలు చేయగా ఈ రిజల్ట్ వచ్చినట్లు తెలుస్తోంది.

ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ అండ్ ఇమ్యునాలజీతో అనుబంధంగా ఉన్న పీహెచ్ డీ విద్యార్ధి  క్రాట్జెల్, బెర్న్ మరియు మిట్టెల్హౌసెర్న్ మాట్లాడుతూ కరోనా వైరస్ నుంచి శానిటైజర్లు రక్షిస్తున్నట్లు తమ పరిశోధనల్లో తేలిందన్నారు. అయితే మనం శానిటైజర్లతో ఎంతో సేపు శుభ్రం చేసుకుంటున్నామనే అంశంపై ఆధారపడి ఉంటుందన్నారు.

Latest Updates