వరి తగ్గిద్దాం.. మిల్లెట్స్ ​పండిద్దాం

  • వీటిలోనే పోషకాలు ఎక్కువ.. పర్యావరణానికీ మేలు
  • ఐఎస్​బీ, ఐఐపీహెచ్​స్టడీలో వెల్లడి

మన దేశంలో ఎక్కువగా వరిని పండిస్తుంటారు చాలామంది రైతులు. అయితే వరికి బదులు మిల్లెట్స్​(చిరుధాన్యాలు) పండిస్తే బాగుంటుందని ఓ స్టడీ పేర్కొంది. ఈ పంటల్లో పోషక విలువలు ఎక్కువగా ఉండడంతో పాటు పర్యావరణానికీ మేలు చేస్తాయని వెల్లడించింది. ఇండియన్ ​స్కూల్​ఆఫ్ ​బిజినెస్​(ఐఎస్​బీ‌‌‌‌‌‌‌‌– హైదరాబాద్), ఇండియన్​ఇనిస్టిట్యూట్​ఆఫ్​పబ్లిక్​ హెల్త్​(ఐఐపీహెచ్​– ఢీల్లీ) కలిసి ఈ స్టడీ చేశాయి.  50 ఏళ్లలో భారత్​లో తృణధాన్యాల ఉత్పత్తి మూడు రెట్లు పెరగ్గా, అందులో సగం వాటా బియ్యానిదేనని ఈ అధ్యయనం తేల్చింది. ‘‘గ్రీన్ ​రెవల్యూషన్​ విజయవంతమైన తర్వాత వరి సాగు గణనీయంగా పెరిగింది. దేశంలో చిరుధాన్యాలు సాగు చేస్తున్నప్పటికీ, వీటి వాటా చాలా తక్కువ మొత్తంలో ఉంటోంది. సంప్రదాయ పంటలైన మొక్కజొన్న, మిల్లెట్స్ ​లాంటి చిరుధాన్యాల్లో పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి. వరి పంటతో పోలిస్తే ఇవి పర్యావరణానికి తక్కువ హాని కలిగిస్తాయి” అని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

‘‘చిరుధాన్యాల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి తక్కువ నీటితోనే పండుతాయి. ఈ పంటలు ఎదగడానికీ ఎక్కువ ఎనర్జీ అవసరం లేదు. గ్రీన్​హౌస్​గ్యాసెస్​ను తక్కువ స్థాయిలో విడుదల చేస్తాయి. అదే వరికి ఎక్కువ నీళ్లు అవసరం. ఇప్పటికే ఇండియాలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఇలాంటి సమయంలో తక్కువ నీటిని తీసుకునే  పంటలను ఎంచుకోవడమే మేలు’’ అని స్టడీ కో‌‌‌‌‌‌‌‌–ఆథర్ యూఎస్​లోని డెలావేర్ ​యూనివర్సిటీకి చెందిన కైలె డేవిస్​చెప్పారు. ‘‘మరోవైపు వరి పొలాల్లో నిల్వ ఉండే నీటితో బ్యాక్టీరియా ఫామ్​అయి, అది గ్రీన్​హౌస్​గ్యాసెస్​కు కారణమవుతుంది. ఇవి వాతావరణంలో కలవడంతో పర్యావరణం దెబ్బతింటోంది” అని పేర్కొన్నారు.  ‘‘దేశంలో వరి పంటను తగ్గించాల్సిన అవసరముంది.  దానికి బదులు మిల్లెట్స్‌‌ను పండిస్తే  బాగుంటుందని అనుకుంటున్నాం” అని డేవిస్ ​చెప్పారు. దీనిపై ప్రభుత్వం దృష్టి సారిస్తే ఏయే ప్రాంతాలు మిల్లెట్స్ ​పంటలకు అనుకూలమో తెలియజేస్తామన్నారు. రైతులు చాలా వరకు వరి పంటనే నమ్ముకుంటున్నారన్నారు. వారు ఇతర పంటలు సాగు చేసేలా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు.  ఇందుకు అనుగుణంగా ప్రభుత్వం సబ్సిడీ పథకాలనూ మార్చాల్సిన అవసరం ఉందని సైంటిస్టులు అభిప్రాయపడ్డారు.

A study suggests that millets are better than rice if they are grown

Latest Updates