టీవీతో వస్తడు.. పాఠాలు చూపిస్తడు

కరోనా వల్ల స్కూళ్లు తెరుచుకోలేదు. ఆన్‌ లైన్‌ పాఠాలే నడుస్తున్నాయి. కానీ చత్తీస్‌గఢ్‌ లోని కొరియా జిల్లాలో చాలా మంది పేద స్టూడెంట్లు స్మార్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఫోన్లు, టీవీలు లేక పాఠాలు వినలేక పోతున్నారు. అలాంటి వాళ్లకు ఎట్లా గైనా క్లాసులు వినిపించాలనుకున్నాడు ఆ జిల్లాలో పని చేసే టీచర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అశోక్‌ లోధీ. బైక్‌ పై టీవీ పెట్టుకొని స్టూడెంట్ల దగ్గరకెళ్లి పాఠాలు చూపిస్తానని ఆయన పని చేసే స్కూలు మేనేజ్‌ మెంట్‌ కు చెప్పాడు. వాళ్లు కూడా ఓకే చెప్పడంతో స్కూల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు చెందిన ఓ టీవీని, మైక్‌ ను బైక్‌ కు సెట్‌ చేసుకొని ఊరూరా తిరుగుతూ పిల్లలకు పాఠాలు చూపిస్తున్నాడు. ఇంత మంచి పని చేస్తున్న లోధీని పిల్లలు ‘సినిమా వాలే బాబూ’ అని ముద్దుగా పిలుచుకుంటున్నారు.

Latest Updates