విమానంలో వచ్చి దొంగతనం చేసి.. మళ్లీ విమానంలో తిరిగి వెళ్లిపోతాడు

హైదరాబాద్: విమానంలో మహా నగరానికి వచ్చి దొంగతనాలు చేసి దర్జాగా తిరిగి విమానంలో వెళ్లిపోతున్న ఓ అంతర్ రాష్ట్ర దొంగను సైబరాబాద్ పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. పట్టపగలే దర్జాగా దొంగతనం చేయడం ఈయనగారి స్టైల్. సినిమా ల స్టైల్ లో జల్సాలకు అలవాటు పడి.. కోరికలను తీర్చుకోవడానికి డబ్బుల కోసం ఇలా దొంగతనాలు చేస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఫ్లైట్లో వచ్చి చోరీ చేసి తిరిగి ఫ్లైట్లో వెళ్ళే అంతరాష్ట్ర దొంగ గిరి గంగాధర్ ను అరెస్టు చేసిన సైబరాబాద్ పోలీసులు… హైదరాబాద్ గచ్చిబౌలి లోని సైబరాబాద్ కమీషనరేట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దొంగను ప్రవేశపెట్టారు.

ఈ సందర్భంగా సీపీ సజ్జనార్ మాట్లాడుతూ బాలానగర్, అల్వాల్ పోలీసులు సంయుక్తంగా పని చేసి గజదొంగ గిరి గంగాధర్ ను చాక చక్యంగా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. గిరి గంగాధర్ పట్టపగలే చోరీలు చేసేవాడిని, సైబరాబాద్ లో మొత్తం నాలుగు చోరీలు చేసినట్లు తెలిపారు.. నిందితుని వద్ద నుండి 40 తులాల బంగారు ఆభరణాలు, 1 కేజీ వెండి స్వాధీనం చేసుకున్నామన్నారు… చత్తీస్ ఘడ్ కు చెందిన గిరి గంగాధర్ విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి చోరీలు చేసేవాడు. గతంలో అల్వాల్ పరిధిలో ఉండే వాడు. అందు వలన ఆ ఏరియా పై పూర్తి అవగాహన ఉండటంతో సులువుగా దొంగతనాలు చేసేవాడని తెలిపారు. విమానంలో వచ్చి చోరీలు చేసి తిరిగి వెంటనే విమాపంలో వెళ్లిపోయేవాడని పేర్కొన్నారు… ప్రజా సంచారం తక్కువగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుని చోరీలు చేసేవాడని తెలిపారు. గంగాధర్ ను పట్టకోవడం వలన అల్వాల్ లో రెండు కేసులు, కీసర లో రెండు కేసులు డిటెక్ట్ అయ్యాయని తెలిపారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా నిందుతున్ని అదుపులోకి తీసుకున్నామన్నారు  సైబరాబాద్ సీపీ సజ్జనార్.

Latest Updates