గ్రామస్తుల దాడిలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ హతం

దొంగతనానికి పాల్పడ్డ ఓ  దొంగ  గ్రామస్తుల చేతికి చిక్కి , చివరికి వాళ్ల చేతిలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన ఝార్ఖండ్ రాష్ట్రంలోని డుంకా జిల్లా చిహుంతియా గ్రామంలో జరిగింది.  గత అర్ధరాత్రి నలుగురు దొంగలు తమ గ్రామంలో దొంగతనానికి  పాల్పడ్డారని తెలియడంతో.. గ్రామస్తులు వారిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ నలుగురూ గ్రామస్తుల నుంచి తప్పించుకునే క్రమంలో అందులో ఒకరు వాళ్ల చేతికి చిక్కడంతో అతడిని చావకొట్టారు.  విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి చేరుకొని విచారణ చేశారు. చనిపోయిన దొంగ ఓ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని, మిగతా ముగ్గురి గురించి తెలియాల్సి ఉందని అన్నారు. దాడికి పాల్పడిన నలుగురు గ్రామస్తులను అదుపులోకి విచారణ జరుపుతున్నారు.

Latest Updates