హైదరాబాద్ లో నీటి గుంతలో పడి బాలుడు మృతి

హైదరాబాద్‌: నీటి గుంతలో పడి బాలుడు మృతి చెందిన సంఘటన ఆదివారం హైదరాబాద్ లో జరిగింది. జూబ్లీహిల్స్ రోడ్‌ నెంబర్ 5లోని దుర్గాభవాని నగర్‌లో నిర్మాణంలో ఉన్న భవనంలో ఉన్న గుంతలో పడి మూడేళ్ల బాలుడు సిద్ధు మృతి చెందాడు. ఆడుకుంటూ వెళ్తూ బాలుడు నీటిగుంతలో పడి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు.

ఈ ఘటనకు కారణమైన భవనం పరుచూరి రవీంద్రనాథ్‌కు చెందిన భవనంగా గుర్తించారు.న్యాయం చేయాలంటూ మృతదేహంతో స్థానికులు భవనం ముందు ఆందోళనకు దిగారు. భవనం వద్ద భారీ గుంత ఉండడం వల్ల తమ బిడ్డ ఆడుకుంటూ వెళ్లి గుంతలో పడి చనిపోయాడని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. భవన యజమానిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

Latest Updates