కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా.. 17 మందికి తీవ్ర గాయాలు

  • ఒకరి మృతి.. మరికొందరి పరిస్థితి విషమం

సూర్యాపేట: చిలుకూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడడంతో 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు మృతి చెందారు. హుజూర్ నగర్  సీతారాం నగర్ కు చెందిన వ్యవసాయ కూలీలు 18 మంది పొలంలో నాటు వేసే పనులు చేస్తున్నారు. మండలం సీతారాంపురం సమీపంలోని పొలం పనులు చేసి సాయంత్రం తిరిగి వస్తుండగా చిలుకూరు వద్ద  ట్రాక్టర్ అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. ట్రాక్టరలో ఉన్న 17 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఒకరు ఆస్పత్రికి తరలిస్తుండగానే మృతి చెందారు. గాయపడిన వారందరినీ హుజూర్ నగర్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదానికి గురైన వారందరూ సీతారాం నగర్ కు చెందిన వారే కావడం తో హుజూర్ నగర్ లో విషాద ఛాయలు అలుముకున్నాయి . హుజూర్ నగర్ యస్.ఐ వెంకటరెడ్డి, సుందరయ్య,  చిలుకూరు ఏ.యస్.ఐ  పులి వెంకటేశ్వర్లు క్షతగాత్రులను హుటాహుటిన ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేసి ఆస్పత్రిలో వారికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రయత్నాలు చేశారు. తీవ్రంగా గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు సమాచారం.

ఇవి కూడా చదవండి..

ఆ యువకుడి ఆదాయం రోజుకు 9 లక్షలు… ఆ డబ్బుతో లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులు

కిడ్నాప్ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. మాజీ మంత్రి అఖిలప్రియ చెప్పిన వివరాలే కీలకం?

జోరుగా రికార్డింగ్ డ్యాన్సులు.. అరెస్ట్ చేసిన పోలీసులు

Latest Updates