బైకును ఢీకొన్న ట్రాక్టర్.. 9 నెలల చిన్నారి మృతి

హైదరాబాద్:  మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టాక్టర్ ఢీకొని 9 నెలల పసి పాప అరణ్యం మృతి చెందింది. మీర్ పేట్ సర్వోదయ నగర్ కాలనీ లో ఉండే నర్సింహా రెండో కూతురి వివాహం నిశ్చయించారు. తన చెల్లి పెళ్లి కోసం ఆయన మొదటి కూతురు శిరీష, శివ ఇద్దరూ కలసి బైకుపై  బండ్లగూడ నుంచి బయలుదేరి వస్తున్నారు. వీరి బైకు మీర్ పేట్ లోని సరోద్యయ కాలనీ  లోకి రాగానే అటునుంచి వస్తున్న టాక్టర్లు,  బైకు ను డి కొట్టాయి. దీంతో బైకుపై ఉన్న వారు ఎగిరిపడగా.. తల్లి చేతుల్లో ఉన్న అరణ్య (9 నెలలు) అక్కడికి అక్కడే  మృతి చెందింది. శుభ కార్యానికి వస్తుంటే చావు ఎదురు కావడంతో నరసింహా బంధువులు కంట తడిపెట్టుకుని విలపించారు. ప్రమాదం జరిగిన వెంటనే ట్రాక్టర్  డ్రైవర్ పరారయ్యాడు. దీంతో చిన్నారి బంధువులు  రోడ్డుపై బైటాయించి ఆందోళన చేపట్టారు. తమకు న్యాయం చేయాలని చనిపోయిన చిన్నారి తాత నర్సింహా.. తల్లిదండ్రులు, బంధువులు డిమాండ్ చేశారు.

Latest Updates