కాలువలోకి బోల్తా కొట్టిన ట్రాక్టర్..

ఇద్దరు కార్మికుల మృతి

గుంటూరు: బాపట్ల మండలం కంటకవాని పాలెం దగ్గర ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా కొట్టింది. ఏకంగా  కాలువలో  పడిపోవడంతో ఇద్దరు కార్మికులు మృతి చెందారు. స్థానికులు గమనించి సహాయక చర్యలు చేపట్టినా ప్రయోజనం లేకపోయింది. నేరుగా కాలువలోకి పడడంతో బయటపడలేక… ఊపిరాడక కన్నుమూశారు. మృతులు కర్లపాలెం మండలం పడమట గొల్లపాలేనికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. ఉదయమే పనిలోకి వెళ్తున్నామని చెప్పి బయలుదేరి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారా అంటూ కుటుంబీకులు కన్నీరు మున్నీరుగా విలపించడం స్థానికులను విషాదంలో ముంచెత్తింది.

Latest Updates