హైద‌రాబాద్ అమ్మాయిని దుబాయి షేక్ కు అమ్మేసిన ట్రావెల్ ఏజెంట్

హైదరాబాద్ కి చెందిన యువతిని ఓ ట్రావెల్‌ ఏజెంట్‌ నిలువునా మోసం చేశాడు. దుబాయ్ కి పంపిస్తానని చెప్పి ఆ అమ్మాయిని దుబాయి షేక్ కు అమ్మేశాడు. ఇప్పుడా మహిళ దుబాయ్‌ షేక్‌ చేతికి చిక్కి నరకం అనుభవిస్తోంది. వివరాల్లోకి వెడితే.. నగరానికి చెందిన నూర్‌ అనే యువతిని దుబాయ్ షేక్ కు రూ.2 ల‌క్ష‌లు అమ్మేశాడు ట్రావెల్ ఏజెంట్. అంత‌టితో ఆగ‌క అత‌నితో బ‌లవంతంగా కాంట్రాక్ట్ మ్యారేజ్ జ‌రిపించాడు. అప్ప‌టినుండి దుబాయ్ షేక్ ఆమెపై ప‌లుమార్లు అత్యాచారం చేస్తూ వేధింపుల‌కు గురిచేస్తున్నాడు. ఆ బాధ‌లు త‌ట్టుకోలేక బాధితురాలు దుబాయ్ లోని మ‌రో ప్రాంతంలో త‌ల‌దాచుకోగా.. ఆమెని వెతికి ప‌ట్టుకున్నాడు షేక్. అయితే షేక్ వేధింపుల నుంచి కాపాడాలంటూ న‌గ‌రంలో ఉన్న త‌న త‌ల్లికి ఎలాగోలా స‌మాచార‌మిచ్చింది ఆ యువ‌తి. ఈ విష‌యం తెల‌సుకున్న నూర్ త‌ల్లి.. త‌న కూతురిని ఎలాగైనా కాపాడాలంటూ పోలీసులకు విజ్ఞ‌ప్తి చేసింది.

Latest Updates