ఓటర్లకు డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నాయకుడు

పెద్దపల్లి జిల్లా: మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారమే చివర రోజు కావడంతో కొందరు నాయకులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారు. డబ్బుతో ఓట్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారు. పెద్దపల్లి జిల్లాలో అధికార పార్టీ టీఆర్ఎస్ కి చెందిన ఓ నాయకుడు డబ్బులు పంచుతున్న వీడియో ఒకటి ప్రస్తుతం కలకలం రేపుతోంది.

జిల్లా కేంద్రంలోని రెండవ వార్డుకు చెందిన టీఆర్ఎస్ అభ్యర్థి పస్తం హన్మంత్ సోదరుడు… ఒక వర్గం వారికి రూ.2,44,000/  పంచుతూ.. కచ్చితంగా తమ పార్టీకే ఓటేయ్యాలని ఓటర్ల నుండి ప్రమాణం చేయించుకున్నాడు. తమ వార్డులో వేరే అభ్యర్థి ఓటు అడగడానికి వస్తే రావద్దని, వస్తే తరిమి కొట్టాలని, సదరు వర్గం వారికి చెబుతున్నట్టుగా ఆ వీడియో లో ఉంది. ఇతర పార్టీ వాళ్ళు ఓట్లు అడగడానికి వస్తే.. “మీకు ఓటు వేయం” అని చెప్పాలని వారిని బెదిరించారు ఆ టీఆర్ఎస్ నేత.

See More News

10 కోట్ల లోన్ ఇప్పిస్తానని.. కోటిన్నర కొట్టేసిన లాయర్

సైనికులు ప్రార్థనలో ఉండగా మిలటరీ క్యాంప్ పై ఎటాక్..

రైల్లో పరిచయం.. లాడ్జిలో అత్యాచారం

Latest Updates