మద్యం ఎక్కువ అమ్మితే అవార్డులు : సర్కారుపై డీకే అరుణ సెటైర్లు

A two-day deeksha by the BJP at Indira Park says DK Aruna

మహిళల పై ఎప్పుడు దాడులు జరిగినా అందుకు మొదటి కారణం మద్యం అవుతుందని అన్నారు బీజేపీ నేత డీకే అరుణ. మద్యం పై మూలాలను నరికివెయ్యాల్సిన అవసరం ఉందని అన్నారు.  తెలంగాణ ప్రభుత్వం మద్యం ఒక ఆదాయ వనరుగానే చూస్తోందని, రాష్ట్రంలో మద్యం నిషేదించి ఇతర వనరులను ఎందుకు ప్రోత్సహించకూడదని ఆమె ప్రశ్నించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ అప్పుల రాష్ట్రంగా ఎందుకు మారిందన్నారు. రాష్ట్రంలో మద్యం ఎక్కువ అమ్మిన వాళ్లకు అవార్డుల ప్రకటనలు చేసే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు.

రాష్ట్రంలో మద్యం నిషేదించేందుకు గురువారం ఇందిరా పార్కు దగ్గర బీజేపీ ఆధ్వర్యంలో 2 రోజుల దీక్ష చేపట్టిందని అరుణ తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వంపై బీజేపీ చేసే ఉద్యమాల్లో ఇది ప్రారంభమని అన్నారు.గతంలో గద్వాల్ జిల్లా ఏర్పాటు కోసం రెండు రోజుల దీక్ష చేశానని ఆమె గుర్తు చేశారు. ఆ కారణంగానే ప్రత్యేక జిల్లా ఏర్పడిందని, ఇప్పుడు మద్యనిషేధం కోసం మళ్ళీ రెండు రోజులు దీక్ష చేపట్టానని అన్నారు. ఫలితం పాజిటివ్ గా వస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ విషయంలో కేసీఆర్ ప్రభుత్వం పై కేంద్రం ఒత్తిడి కచ్చితంగా ఉందన్నారు డీకే అరుణ.ఆర్టీసీ పై ముఖ్యమంత్రి ఎందుకు దిగి వచ్చిండో అందరికీ తెలుసనని, కేంద్రం వత్తిడి తోనే అది సాధ్యమైందని తెలిపారు.

Latest Updates