పస్తులుండకూడదనే : ట్రక్ నిండా గోధుమ పిండి ,15వేలు నగదు పంపింది ఆ హీరోనేనా

అది ఢిల్లీలోని నిరుపేదలుండే ప్రాంతం. ఆ ప్రాంతానికి సాయంత్రం సయమం చికటి పడుతున్న వేళ ఓ వ్యాన్ వచ్చి ఆగింది. ఆ వ్యాన్ ను నుంచి దిగిన యువతీ యువకులు లోడ్ చేసిన కిలో గోధుమ పిండి ప్యాకెట్ల ను సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ అక్కడ పెట్టి వెళ్లారు. లాక్ డౌన్ తో ఇబ్బందులు పడుతున్న స్థానికులు ఆ కవర్లను తీసుకున్నారు. ఓపెన్ చేసి చూడగా అందులో గోధుమ పిండి.. పిండి లోపల 15వేలు నగదు ఉండడం పై ఆశ్చర్యానికి గురయ్యారు.గోధుమ పిండిలో 15వేలు డబ్బులు ఎవరు పెట్టి ఉంటారనే ప్రశ్నలు తలెత్తుతుండగా.. ఆ గోధుమ పిండి ప్యాకెట్లను పంపిణీ చేసింది అమీర్ ఖాన్ అని అంటున్నారు. ఎందుకంటే బాలీవుడ్ స్టార్ హీరో సేవా గుణంలో ముందుంటారు. సాయం చేస్తే చెప్పుకోడు. పబ్లిసిటీ కోసం అసలు పాకులాడరు. లాక్ డౌన్ సమయంలో పేదలు  పస్తులండకూడదనే ఉద్దేశంలో ఇలా చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు గోధుమ పిండి ప్యాకెట్ల గురించి ఆరా తీసేందుకు మీడియా సంస్థ ఐఏఎన్ఎస్ అమీర్ ఖాన్ అఫీస్ సభ్యుల్ని సంప్రదించగా వాళ్లు మాట్లాడేందుకు ఇష్టపడలేదని సమాచారం.

Latest Updates