సరస్సులో 6నెలల బుడ్డోడి వేక్ బోర్డింగ్ : బుడ్డోడి తెగువకు నెటిజన్ల ఫిదా

ఆరునెలల బుడ్డోడు సరస్సులో వేక్ బోర్డింగ్ చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అమెరికాకు చెందిన మిండి, కాస్సే దంపతుల కుమారుడు ఆరునెలల రిచ్ లు ఉటాలోని ఓ సరస్సులో సేదతీరేందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆరు నెలల రిచ్ సరస్సులో వేక్ బోర్డింగ్ చేశాడు.

ప్రస్తుతం ఆ వీడియోలు వైరల్ కాగా..వేక్ బోర్డింగ్ చేస్తున్న బుడతడు ఏమాత్రం భయం లేకుండా ఎంజాయ్ చేశాడు. రిచ్ ను అనుకరిస్తూ అతని తండ్రి బోట్ తో వెంబడించాడు.

అయితే బుడ్డోడు చేస్తున్న వేక్ బోర్డింగ్ వీడియోల్ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.ఆ వీడియోలపై నెటిజన్లు గ్రేట్ అని ప్రశంసల వర్షం కురిపిస్తుండగా, మరికొందరు రిచ్ భద్రతపై ఆందోళన వ్యక్తం చశారు

Latest Updates