ప్లీజ్ మమ్మల్ని కరోనా వైరస్ అని పిలవొద్దు

కరోనా వైరస్ శారీరకంగా, మానసికంగా ఎంత ఇబ్బంది పెడుతుందో తెలిపే ఉదంతం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

కరోనా ప్రజల్ని ఎంత భయాందోళనల్ని సృష్టిస్తుందో మనందరికి తెలిసిందే. ముఖ్యంగా వైరస్ ప్రభావంతో కొంతమంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  ఈశాన్య రాష్ట్రాలకు చెందిన విద్యార్ధుల్ని జాత్యహంకారం, వివక్షత సమస్యలు వెంటాడుతున్నాయి.

ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని చున్నీ కలాన్ అనే చిన్న గ్రామంలో నివసిస్తున్న విద్యార్థులు ఓ వీడియోను విడుదల చేశారు.  ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ వీడియోలో కరోనా తో కొంతమంది విద్యార్ధులు, ప్రజలు తమని ఏ విధంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారో చూడండి అంటూ చెప్పే ప్రయత్నం చేశారు.

“మమ్మల్ని కరోనా, చైనా కరోనా, చైనాకు చెందిన వారిలా ట్రీట్ చేయడం మానకోండనే క్యాప్షన్ తో పంజాబ్ కు చెందిన డిమాపూర్ 24/7 అనే ఫేస్ బుక్ పేజీలో వీడియోను షేర్ చేశారు.

ఆ వీడియోలో తాము పంజాబ్ లో ఉంటున్నా చైనా వారిలా కనిపిస్తామని, ఇది చాలా బాధకలిగిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు అలా చూడొద్దని కోరారు.  మేం చైనా దేశస్థులని భావించిన తోటి విద్యార్ధులు వారి రూముల్లో అద్దెకు ఉండేందుకు నిరాకరించారని వాపోయారు.  అందుకే ప్రతీఒక్కరు భారత దేశం గురించి, చిత్రపటం గురించి అవగాహన తెచ్చుకోవాలని కోరారు.

Stop calling us corona, chinki, Chinese….North East students of Punjab.#Govt_Of_India#say #No #to #Racism#Students #Northeast#India

Posted by Dimapur 24/7 -Instagram on Friday, March 13, 2020

Latest Updates