పెండ్లి కొడుకు వింత ప్రశ్న..ఈమె అమ్మాయా? అబ్బాయా?

  •     చర్చిలో పెండ్లి కొడుకు వింత ప్రశ్న
  •     లాస్ట్​ మినెట్​లో నిలిచిన పెండ్లి

బోధన్, వెలుగు : నిజామాబాద్​ జిల్లా బోధన్ టౌన్ లో శుక్రవారం జరగాల్సిన ఓ పెండ్లి, సరిగ్గా లాస్ట్ మినెట్​లో నిలిచిపోయింది. శక్కర్ నగర్ కు చెందిన యువకుడికి, రాకాసిపేట్ కు చెందిన యువతికి పెండ్లి నిశ్చయించారు.  కొద్ది రోజుల కింద ఎంగేజ్ మెంట్ కూడా చేసుకున్నారు. శుక్రవారం స్థానిక చర్చిలో పెండ్లికి పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇరువైపులా బంధువులు, దోస్తులు  వచ్చారు. చర్చిలో పాస్టర్​​పెండ్లి కొడుకు, పెండ్లి కూతురును ‘ఒకరంటే ఒకరికి ఇష్టమేనా?’ అని అడిగారు. వెంటనే  వరుడు ‘ఇంతకీ ఈమె అబ్బాయా? అమ్మాయా? ’ అంటూ వింత ప్రశ్న వేశాడు. ఆశ్చర్యపోయిన వధువు తరుపు బంధువులు ‘అమ్మాయే’ అని చెప్పడంతో ‘అలా అని రాసివ్వండి’ అని వరుడు అన్నాడు. దీంతో ఆగ్రహించిన వధువు బంధువులు వరుడిపై దాడికి యత్నించారు. దీంతో గొడవ తీవ్రమై పెండ్లి నిలిచిపోయింది.

Latest Updates