నిత్య పెళ్లి కొడుకు.. సాఫ్ట్ వేర్ అమ్మాయిలే అతడి టార్గెట్..

ప్రేమ పెళ్లి చేసుకొని ఇప్పుడు వదిలించుకోవడానికి వేధిస్తున్నాడంటూ భర్తపై ఫిర్యాదు చేసింది ఓ మహిళ. హైదరాబాద్ చందానగర్ ఆర్టీసీ కాలనీకి చెందిన కుర్ర విజయభాస్కర్ …తనలాగే మరో ఆరుగురు మహిళలను ప్రేమ పేరుతో మోసం చేశాడని ప్రకాశం జిల్లా ఒంగోలులో పోలీసులకు ఫిర్యాదు చేసింది. 2017లో తామిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నామంది. 25 తులాలా బంగారం, 15 లక్షల నగదు విజయ భాస్కర్ కట్నంగా తీసుకున్నాడని తెలిపింది బాధితురాలు. ఆ తర్వాత మేనకోడలుపై మనసుపడి  కుటుంబ సభ్యులతో కలసి తనని వేధిస్తున్నాడని ఆరోపించింది.

భార్య ఉండగానే మరో ఇద్దరిని పెళ్లి చేసుకుంటానని విజయభాసర్కర్ హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆంధ్రా అమ్మాయిలు, సాఫ్ట్ వేర్ ఉద్యోగినులను  టార్గెట్ చేసి మోసం చేస్తున్నట్లు సమాచారం.

Latest Updates