అమ్మాయిలను వేధించిన వ్యక్తిని బూటుతో కొట్టిన లేడీ కానిస్టేబుల్- వీడియో

ఉత్తర ప్రదేశ్: స్కూలుకు వెళ్తున్న అమ్మాయిలను వేధిస్తున్న వ్యక్తిని బూటుతో కొట్టింది ఓ లేడీ కానిస్టేబుల్. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లా బితూర్ ఏరియాలో జరిగింది. సదరు వ్యక్తిని బూటుతో కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. బితూర్ ఏరియాలో స్కూలుకు వెళ్లే అమ్మాయిలను కొందరు వ్యక్తులు టీజ్ చేస్తున్నారని ‘ఆంటీ రోమియో స్వాడ్’ కు గుర్తుతెలియని వ్యక్తులు ఫిర్యాదు చేశారు. దీంతో అదే ఏరియాలో నిఘా పెట్టిన పోలీస్ టీం స్కూలు కు వెళ్తున్న అమ్మాయిలను టీజ్ చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. దీంతో పాటు ఆవ్యక్తిని ఓ లేడీ కానిస్టేబుల్ తన బూటుతో  కొట్టింది. ఆ వ్యక్తిని స్టేషన్ కు తీసుకెళ్లి… కేసును నమోదు చేశారు పోలీసులు.

Latest Updates