రేప్ కేసు నుంచి బయటపడేస్తా: నిందితుల నుంచి రూ.35 లక్షల లంచం.. అడ్డంగా బుక్కైన ఎస్సై శ్వేత

రేప్ కేసు నుంచి బయట పడేసేందుకు నిందితుల నుంచి రూ.30లక్షలు డిమాండ్ చేసిన మహిళా ఎస్సైకి కోర్ట్ వారం రోజుల పాటు రిమాండ్ విధించింది.

2019లో ఓ ప్రైవేట్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ కెనాల్ షా అతని సోదరుడు భవేష్ లు తమపై  అత్యాచారం చేశారంటూ ఇద్దరు మహిళలు అహ్మదాబాద్  పోలిస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహిళల ఫిర్యాదుతో స్టేషన్ ఇంఛార్జ్ గా  ఉన్న  ఎస్సై శ్వేతా జడేజా విచారణ చేపట్టారు. విచారణ సందర్భంగా నిందితుడు కేనాల్ షా పై యాంటీ సోషల్ యాక్టివిటీస్ పాసా చట్టం కింద కేసు నమోదు చేయకుండా, సొంత జిల్లా కోర్ట్ తరలించకుండా  కేసు నుంచి తప్పించేందుకు రూ.35 లక్షలు,  బాధితులతో రాజీ కుదుర్చేందుకు కెనాల్ షా సోదరుడు భవేష్ నుంచి రూ.20లక్షలు వసూలు చేసేందుకు ప్రయత్నించింది. అయితే రూ.20 లక్షలు చెల్లించేందుకు తాను సిద్ధంగా లేనని, ఎస్సైకి రూ.20లక్షలు, బాధితులకు రూ.15లక్షలు ఇచ్చేందుకు నిందితుడు భవేష్  అంగీకరించాడు.

విచారణ కొనసాగుతుండగా బాధితులు ఎస్సైపై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు..రేప్ కేసు విచారిస్తున్న ఎస్సై శ్వేతాపై, నిందితులైన కేనాష్ అతని సోదరుడు భవేష్ కదలికలపై కన్నేశారు. ఇదే క్రమంలో శ్వేతా  నిందితుల నుంచి పెద్దమొత్తం లో వసూలు చేస్తుండగా ఏసీబీ అధికారులు  రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. దీంతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. విచారణలో మహిళా ఎస్సై రేప్ కేసు నుంచి బయటపడేసేందుకు నిందితుల నుంచి రూ.35లక్షలు వసూలు చేసినట్లు తేలింది. దీంతో నిందితురాలు శ్వేతను కోర్ట్ లో హాజరు పరిచారు. విచారణ లో భాగంగా శ్వేతకు వారం రోజుల రిమాండ్ విధిస్తూ జిల్లా న్యాయ స్థానం తీర్పిచ్చింది.

Latest Updates