ప్లాట్​ఫాంపైనే పండంటి బిడ్డకు పురుడు

బయ్యారం(గార్ల), వెలుగు: ప్లాట్​ఫాంపై ఓ మహిళ ప్రసవించింది. ఈ  సంఘటన బుధవారం మహబూబాబాద్​జిల్లా గార్ల  రైల్వే స్టేషన్​లో జరిగింది. ఏపీలోని కృష్ణా జిల్లా కొండపల్లికి చెందిన రాతోలు శైలజ ప్రసవం కోసం మహబూబాబాద్ ఏరియా హాస్పిటల్​కు వస్తోంది. డోర్నకల్ స్టేషన్ దాటాక ఆమెకు నొప్పులు వచ్చాయి.

దీంతో తోటి ప్రయాణికులు గార్ల స్టేషన్ లో దించి చుట్టు పక్కల ఇండ్ల నుంచి చీరలు తెచ్చి గుడారం ఏర్పాటు చేసి ప్రసవం చేశారు. మగబిడ్డ పుట్టాడు. స్థానిక వైద్య సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకుని వెంటనే గార్ల  పీహెచ్ సీకి తరలించి ట్రీట్​మెంట్​అందించారు. తల్లిబిడ్డ క్షేమంగా ఉన్నారు.

Latest Updates