మహిళను బండరాయితో కొట్టి చంపారు

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం తంగడపల్లి దగ్గర దారుణం జరిగింది. ఓ మహిళను బండరాయితో కొట్టి చంపేశారు గుర్తు తెలియని వ్యక్తులు. అత్యాచారం చేసి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్ టీం….. దగ్గర్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. ఘటన జరిగిన ప్రాంతంలో మహిళకు సంబంధించిన వస్తువులు కానీ, దుస్తులు కానీ లేకపోవడంతో….. ఆమె వివరాలు సేకరించడం కష్టంగా మారింది.

Latest Updates