మహిళను చెట్టుకు కట్టేసి కొట్టి.. వీడియో తీసి..

ఉత్తరప్రదేశ్: పిల్లలను ఎత్తుకుపోయేదనే అభియోగంతో ఓ మహిళను దారుణంగా  హింసించారు ఆ ఊరి ప్రజలు. ఆ మహిళను చెట్టుకు కట్టేసి కొడుతూ అంతటితో ఆగకుండా ఈ దృశ్యాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టారు. ఈ సంఘటన గోండా జిల్లా రహెలీ గ్రామంలో జరిగింది. ఆ వీడియో  పోలీసుల వరకు వెళ్లడంతో.. వారు ఈ ఘటన కారణమైన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..  రహెలీ గ్రామ సరిహాద్దులోని పొలం పనులు చేసుకొనే గ్రామానికి చెందిన మహిళను ఓ  అజ్ఞాత స్త్రీ స్కూళ్లకు సెలవులు ఎప్పటినుంచి అనే విషయం గురించి అడిగింది. ఆమె ప్రవర్తన విచిత్రంగా అనిపించడంతో ఆమె గ్రామానికి వచ్చి ఆ ఊరి వారికి ఆ అజ్ఞాత స్త్రీ గురించి తెలిపింది.

విషయం విన్న గ్రామ ప్రజలు ఆమెను పట్టుకొని ప్రశ్నించగా.. ఆమె సరైన సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించింది. దీంతో తమ అనుమానం నిజమేననుకున్న గ్రామస్తులు ఆ మహిళను పిల్లలను ఎత్తుకుపోయేదానిలా భావించి ఆమెను  చెట్టు కట్టేసి కొట్టారు.  ఈ సంఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. విషయం తెలుసుకున్న నవాబ్ గంజ్ పీఎస్ పోలీసులు ఆదివారం ఉదయం గ్రామానికి చేరుకొని.. ఈ ఘటనపై ఎంక్వయిరీ చేసి ఆమెపై దాడి చేసిన 9 మందిని అదుపులోకి తీసుకున్నారు.

మహిళకు గాయాలవడంతో చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. ఆమె గురించి విచారణ చేయగా.. ఆమె మామయ్య పీఎస్ దగ్గరలోని షాపూర్ లో ఉంటాడని తెలిసింది. ఆమె మానసిక పరిస్థితి బాగాలేదని అతను చెప్పడంతో ఆ మహిళను  తన కుటుంబ సభ్యులకు అప్పగించారు పోలీసులు. ఈ ఘటనకు కారణమైన 9 మందిపై కేసు నమోదు చేశారు.

Latest Updates