లిక్కర్ మత్తు..ట్రిపుల్ రైడింగ్..ఎగిరిపడి చనిపోయిన యువతి

గచ్చిబౌలి (హైదరాబాద్), వెలుగు: లిక్కర మత్తు..ట్రిపుల్ రైడింగ్ .. స్పీడుగా డ్రైవింగ్ .. కలిసి హైదరాబాద్లోని గచ్చిబౌలిలో ఓ యువతి ప్రాణాలు బలిగొన్నాయి. బైక్ స్కిడ్ కావడంతో వెనుకాల కూర్చున్న యువతి ఎగిరిపడి ఫ్లై ఓవర్ గోడకు గుద్దుకుని చనిపోయింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు ప్రాంతానికి చెందిన రాథోడ్ విక్రమ్
(25 ), ముడావత్ ధనుష్ (27), కామేశ్వరి(24) ముగ్గురు బంధువులు. కామేశ్వరి హైదరాబాద్లోని ఓ ప్రైవేటు స్కూళ్లో టీచర్ గా, విక్రమ్
కొండాపూర్లో డ్రైవర్గా, ధనుష్ బిల్డింగ్ మార్బుల్ టైల్స్ వర్కర్ గా  పనిచేస్తున్నారు. ఈ ముగ్గురూ సోమ వారం ఉదయం చందానగ
ర్ ప్రాంతంలో పార్టీ చేసుకున్నారు. తర్వాత ఫిల్మ్ నగర్లో  ఉండే ఫ్రెండ్స్ ను కలిసేందుకు..ముగ్గురూ కలిసి ఒకే బైక్ పై  బయలుదేరారు.అప్పటికే లిక్కర తాగి ఉన్న విక్రమ్ బైక్ వేగంగా నడుపుతున్నాడు. మధ్యా హ్నం ఒకటిన్నర గంటల టైంలో గచ్చిబౌలి బయోడైవర్సిటీ ఫ్లై ఓవర్ వద్ద బైక్ అదుపుతప్పి పడిపోయారు. వెనకాల కుర్చున్నకామేశ్వరి బైక్ పై నుంచి ఎగిరి ఫ్లైఓవర్ సైడ్ వాల్ గట్టిగా తగలడంతో తీవ్ర గాయాలపాలైంది. వెంటనే దగ్గర్లో ని ప్రైవేటు హాస్పిటల్కు తీసుకెళ్లినా కొద్ది సేపటికి చనిపోయింది. విక్రమ్, ధనుష్  కు గాయాలయ్యాయి. విక్రమ్ లిక్కర్ మత్తులో బైక్ నడిపినట్టు గుర్తించామని, కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు.

Latest Updates