పొలంలో తెగిపడ్డ కరెంటె తీగలు ..షాక్ తో యువకుడు మృతి

యాదాద్రి భువనగిరి జిల్లా: కరెంట్ షాక్ తో యువకుడు మృతిచెందిన సంఘటన ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగింది. రామన్నపేట మండలంలోని లక్ష్మాపురం గ్రామంలో మహేష్ అనే యువకుడు వ్యవసాయ పొలంలో హార్వెస్టర్ తో వరి కోస్తుండగా పొలంలో తెగిపడిన విద్యుత్ తీగలు తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశామన్నారు.

Latest Updates