మైనర్​పై అత్యాచారం : యువకుడికి దేహశుద్ధి

పరిగి,వెలుగు: మైనర్ పై అత్యాచారం చేసిన యువకుడిని పరిగి పోలీసులు అరెస్ట్ చేశారు. పరిగికి చెందిన ఓ బాలిక(12)కు తల్లిదండ్రులు లేకపోవడంతో మేనమామ దగ్గరే ఉంటోంది. పరిగిలోని ఓ కాలనీకి చెందిన బిజిలి సాయి(26)శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో బాలిక బయటికి రావడంతో మాయమాటలు చెప్పి శివారులోకి తీసుకువెళ్లి అత్యాచారం చేశాడు. ఆ బాలిక కుటుంబీకులకు జరిగిన విషయాన్ని చెప్పింది. వెంటనే కాలనీ వాసులు నిందితుడు సాయిని పట్టుకొని చితకబాది  పోలీసులకు అప్పగించారు.

బాలికను వైద్య పరీక్షల కోసం జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆదివారం ఉదయం బాలిక బంధువులు పోలీస్​స్టేషన్​ ముందు బైఠాయించారు. నిందితుడికి కఠిన శిక్షపడేలా చేసి బాలికకు న్యాయంచేస్తామని పోలీసులు హామీ ఇవ్వడంతో వారు వెళ్లిపోయారు. బాలికపై అత్యాచారం విషయం తెలుసుకున్న పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్​రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తమన్నగారి రాంమ్మోహన్​రెడ్డి, సీపీఎం తదితర పార్టీల నాయకులు  స్పందించారు. ఫాస్ట్​ట్రాక్​ కోర్డు ఏర్పాటు చేసి నిందితుడికి కఠిన శిక్ష విధించాలని డిమాండ్​ చేశారు.

See Also : ప్లీజ్‌‌‌‌ ..ఓటేసి పోండి..ఊరెళ్లిన ఓటర్లకు క్యాండిడేట్ల అభ్యర్థన

Latest Updates