పోలీస్ స్టేషన్ లోనే గొంతుకోసుకున్న యువకుడు

జగిత్యాల జిల్లా: పోలీస్ స్టేషన్ లోనే ఓ యువకుడు గొంతుకోసుకున్న సంఘటన శుక్రవారం జగిత్యాల జిల్లాలో జరిగింది. ఓ హత్య కేసులో నిందితుడిని మల్యాల పోలీస్ స్టేషన్ లో .. పోలీసులు విచారిస్తుండగా బాత్రూమ్ వెళ్లిన యువకుడు బ్లెడ్ తో గొంతు కోసుకున్నాడు.

గమనించిన పోలీసులు యువకుడిని వెంటనే ట్రీట్ మెంట్ కోసం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స చేసిన డాక్టర్లు ప్రాణాపాయం లేదని తెలిపారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Latest Updates