కొత్త తరహా సైబర్ మోసానికి తెరలేపిన మాయ లేడి

కొత్త తరహా మోసానికి తెరలేపింది హైదరాబాద్ కు చెందిన సైబర్ లేడీ. నగరంలోని స్కూల్స్ కు చెందిన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ నుంచి.. స్కూల్ ఫొటోస్ డౌన్లోడ్ చేసి.. మార్ఫింగ్ లకు పాల్పడి.. బ్లాక్ మెయిల్ చేస్తున్న యువతి పోలీసులకు చిక్కింది. స్కూళ్లకు చెందిన ఫేస్ బుక్ పేజీ నుంచి.. ప్రోగ్రాములు, ఫంక్షన్ల సమయంలో అప్ లోడ్ చేసిన ఫొటోలను.. ఆ యువతి గత కొంతకాలంగా డౌన్ లోడ్ చేసి మార్ఫింగ్ చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.

మార్ఫింగ్ చేసిన ఫొటోలను స్కూల్ యాజమాన్యానికి పంపి బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నట్లు విచారణలో బయటపడింది. డిగ్రీ (B.sc) చేసిన ఆ యువతి తాను సైబర్ సెక్యూరిటీలో పని చేస్తున్నానంటూ నమ్మించి.. ఈ ఫోటోలు సోషల్ మీడియా నుంచి తీసేస్తానని చెప్పి.. బాధితుల నుంచి డబ్బు వసూలు చేస్తోంది.

హైదరాబాదులోని బాధిత స్కూల్స్ యజమానులు.. సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. విచారణలో సైబర్ మాయలేడీ బండారం బయటపడింది. నిందితురాలి సెల్ ఫోన్లో 225కు పైగా స్కూల్స్ గ్రూపు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. ఉన్నత చదువు చదివి, ఈజీ మనీ కోసం టెక్నాలజీని వాడి.. ఈ తరహా నేరాలకు పాల్పడుతూ పోలీసులకు చిక్కింది.

A young woman from Hyderabad is Committed a new type of cyber fraud.

Latest Updates