
అమరావతి: ఫేస్ బుక్ లో ఏర్పడిన పరిచయంతో మోసపోయిన ఓ యువతి న్యాయం కావాలంటూ మానవ హక్కుల కమీషన్ ని ఆశ్రయించింది. ఫేస్ బుక్ లో స్నేహం పేరుతో పరిచయం పెంచుకున్న ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా తిమ్మాపురంకి చెందిన కాశి అనే యువకుడు, అనంతరం ప్రేమ అని నమ్మించి వివాహం చేసుకుని వదిలేశాడని రాంనగర్ కు చెందిన ఓ యువతి కమిషన్ కు వివరించింది. ఫేస్ బుక్ లో పరిచయం చేసుకొని ప్రేమ పేరుతో పెళ్లి చేసుకొని… లైంగికంగా వాడుకోని వాదిలేయడంతో తనకు న్యాయం చేయాలని హెచ్చార్సీని వేడుకుంది.
పెళ్లి అయిన రెండు నెలలకే 10 లక్షలు కట్నం ఇవ్వాలని వేధించాడాని… తమ కుటుంబ సభ్యులు ఇవ్వలేకపోవడంతో తనని వదిలేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని కన్నీరు పెట్టుకుంది. ఈ ఘటనపై దోర్నాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని బాధితురాలు ఆవేదన వ్యక్తంచేసింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలని కమిషన్ ను వేడుకుంది యువతి.