స్పోర్ట్స్ డ్రామాలో ఆది పినిశెట్టి సినిమా

ప్రస్తుత జనరేషన్ లో స్పోర్ట్స్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు.క్రికెట్ , ప్రో కబడ్డి, ఒలింపిక్స్ ఎంతలా పాపులర్ అవుతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్రముఖ క్రీడా ప్లేయర్ల బయో పిక్స్ వస్తున్నాయంటే స్పోర్ట్స్ కు ఉన్న ఆధరణ అలాంటిది. ఇటీవల MS ధోనీ, గురు, జర్సీ లాంటి సినిమాలు క్రీడా ఆధారంగానే వచ్చి హిట్ కొట్టాయి. ఇప్పుడు మరో సినిమా స్పోర్ట్ అకౌంట్ లోకి రానుంది. ఆది పినిశెట్టి హీరోగా స్పోర్ట్స్ డ్రామా తెరకెక్కనుంది.

కొత్త డైరెక్టర్ పృథ్వీ ఆదిత్య ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. బిగ్ ప్రింట్ పిక్చర్స్‌ బ్యానర్ పై ఐబీ కార్తికేయ‌న్ నిర్మిస్తున్న ఈ సినిమాను.. తెలుగు, త‌మిళంలో ఒకేసారి రూపొందించ‌నున్నారు. ఆది పినిశెట్టితో సినిమా చేసే అవ‌కాశం వ‌చ్చినందుకు చాలా ఆనందంగా ఉందన్నాడు డైరెక్టర్ ఆదిత్య. అథ్లెటిక్స్‌కు సంబంధించిన స్టోరీ అని.. త‌న క‌ల‌ను సాకారం చేసుకోవ‌డానికి హీరో చేసిన ప్రయత్నం ఏంట‌నేది ఆస‌క్తిక‌రంగా ఉంటుందన్నాడు. హీరోయిన్ తదితర వివరాలు త్వరలోనే అనౌన్స్ చేస్తానని తెలిపాడు ఆదిత్య.