ఢిల్లీ ఆప్‌‌‌‌‌‌‌‌ వైపే : ‘చీపురు’ ఊడ్చేస్తుందంటున్న ఎగ్జిట్​పోల్స్

ఢిల్లీ జనం ఆప్​ వైపేనా? ‘చీపురు’ ఊడ్చేస్తుందంటున్న ఎగ్జిట్​పోల్స్
మెజారిటీ కొంచెం తగ్గుతుందంతే..  బీజేపీకి సెకండ్​ ప్లేస్​
దేశ రాజధానిలో ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు
రెండో స్థానంలో బీజేపీ..68 శాతం పోలింగ్‌ నమోదు
చివరలో పుంజుకున్న ఓటింగ్‌

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సజావుగా సాగాయి. మొత్తంగా 68 శాతం పోలింగ్​ నమోదైంది. ఈ ఎలక్షన్లలో కూడా ‘ఆప్’​స్పష్టమైన మెజారిటీతో సర్కారు ఏర్పాటు చేయబోతున్నదని ఎగ్జిట్​పోల్స్​సర్వేల్లో వెల్లడైంది.  టైమ్స్​నౌ, ఇండియా టుడే‌‌‌‌,  ఎన్డీ టీవీ , ఏబీపీ, రిపబ్లిక్, న్యూస్​ ఎక్స్ వంటి చానల్స్​చేసిన సర్వేలో ఆమ్​ ఆద్మీ పార్టీ యావరేజ్​గా 40 నుంచి 63 స్థానాల్లో  విజయం సాధిస్తుందని తేలింది.

న్యూఢిల్లీఅసెంబ్లీ ఎన్నికల్లో ఢిల్లీ ఓటరు చీపురుకే జైకొట్టాడని, 50కి పైగా నియోజకవర్గాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ జెండా ఎగరనుందని ఎగ్జిట్​పోల్స్ వెల్లడించాయి. సీఎంగా కేజ్రీవాల్​కు ఢిల్లీ ఓటర్లు మరోమారు అవకాశమిచ్చారని చెప్పాయి. దాదాపుగా అన్ని ఎగ్జిట్​పోల్స్ లో కాస్త అటూఇటూగా ఇవే ఫలితాలు వెలువరించాయి. ఆమ్ ఆద్మీ పార్టీ మెజారిటీ సీట్లను దక్కించుకుని తిరిగి అధికారాన్ని ఏర్పాటు చేస్తుందని జోస్యం చెప్పాయి. ఆప్​ తర్వాతి స్థానంలో బీజేపీ నిలుస్తుందని, కాంగ్రెస్ పార్టీ మళ్లీ చతికిలపడిందని తెలిపాయి. మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఆమ్‌‌‌‌‌‌‌‌ ఆద్మీ పార్టీ 54 నుంచి 59 సీట్లు, బీజేపీ 9 నుంచి 15 సీట్లు, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ 0 నుంచి 2 సీట్లు గెలుచుకుంటాయని పీపుల్స్‌‌‌‌‌‌‌‌ పల్స్‌‌‌‌‌‌‌‌ ప్రెడిక్షన్‌‌‌‌‌‌‌‌ సర్వే సంస్థ అంచనా వేసింది. చాలా చోట్ల కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ అభ్యర్థులు డిపాజిట్లు కోల్పోతారని తెలిపింది. సంక్షేమ పథకాలే ఆప్​ సర్కారుకు మరోసారి అధికారాన్ని కట్టబెట్టనున్నాయని చెప్పింది. టైమ్స్ నౌ, న్యూస్‌‌‌‌‌‌‌‌ ఎక్స్‌‌‌‌‌‌‌‌ నేతా, రిపబ్లిక్‌‌‌‌‌‌‌‌ టీవీ, ఇండియా టీవీ, జన్‌‌‌‌‌‌‌‌కీ బాత్‌‌‌‌‌‌‌‌, ఇండియా న్యూస్‌‌‌‌‌‌‌‌ నేషన్‌‌‌‌‌‌‌‌ తదితర సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్​ పోల్స్ లోనూ ఆమ్​ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించబోతోందని వెల్లడించాయి.

68 శాతం పోలింగ్‌‌‌‌ నమోదు

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు శనివారం జరిగిన పోలింగ్​లో రాష్ట్రపతి నుంచి సామాన్యుడి దాకా తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. మొత్తమ్మీద ఈ ఎన్నికల్లో పోలింగ్ 68 శాతంగా నమోదైంది. ఉదయం కాస్త మందకొడిగా ప్రారంభమైనా టైం గడిచే కొద్దీ పోలింగ్​ కేంద్రాల్లో ఓటర్లు బారులు తీరారు. పొద్దున 8 గంటలకు పోలింగ్​ మొదలు కాగా.. మూడు గంటల తర్వాత పోలింగ్​ శాతం కేవలం 14.5 మాత్రమే. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో ఈ పర్సంటేజ్​41.5 శాతానికి పెరిగింది. సాయంత్రానికి పోలింగ్‌ నెమ్మదిగా పుంజుకుంది. కేంద్ర మంత్రులు, పలు పార్టీల సీనియర్​ లీడర్లు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఓటేసేందుకు క్యూ కట్టారు. ఢిల్లీ వాసులందరూ ఓటేయాలంటూ వారు పిలుపునిచ్చారు. పోలింగ్​ ప్రారంభమైన తొలి గంటలోనే మాజీ ఉపరాష్ట్రపతి హమీద్​ అన్సారీ, అర్​ఎస్ఎస్ సీనియర్​ లీడర్​రామ్​లాల్​ ఓటేశారు. రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ దంపతులతో పాటు సీఎం అరవింద్​కేజ్రీవాల్​కుటుంబంతో పోలింగ్​ కేంద్రానికి వచ్చి ఓటుహక్కును వినియోగించుకున్నారు. బీజేపీ సీనియర్​ నేత ఎల్​కే అద్వానీ, మాజీ రాష్ట్రపతి ప్రణబ్​ ముఖర్జీ, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్​ సిసోడియా, లెఫ్టినెంట్​ గవర్నర్​అనిల్​ బైజల్, మాజీ ప్రధాని మన్మోహన్​ సింగ్, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ, ఎంపీ రాహుల్​ గాంధీ, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా, ఎంపీ పర్వేశ్​ వర్మ, బీజేపీ ఢిల్లీ చీఫ్ మనోజ్​ తివారీ, కేంద్ర మంత్రులు జైశంకర్, హర్దీప్​ సింగ్​ పూరి తదితర ప్రముఖులు ఓటేశారు. ప్రియాంక గాంధీ కొడుకు రేహాన్, కేజ్రీవాల్​ కొడుకు పుల్కిత్​లు మొదటిసారి ఓటుహక్కును వినియోగించుకున్నారు. వీవీప్యాట్​ స్లిప్పుల్లో కొన్నిచోట్ల క్యాండిడేట్ల పేరు, ఫొటో మిస్సయ్యాయంటూ కంప్లైంట్లు వచ్చాయి. న్యూఢిల్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్​ అభ్యర్థి రోమేశ్​ సభర్వాల్​ పేరు ఇలాగే మిస్సయింది. దీనిపై ఆయన ఫిర్యాదు చేయడంతో అధికారులు ఆ మెషీన్​ను మార్చేశారు. ఈశాన్య ఢిల్లీలోని బాబర్​పూర్​ ప్రైమరీ స్కూల్​పోలింగ్​ కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ ఎన్నికల విధులు నిర్వహిస్తున్న ఆఫీసర్​ ఊధం సింగ్​ గుండెపోటుతో కుప్పకూలారు. ఆస్పత్రికి తరలించే లోపే
చనిపోయారు.

మైనారీటీ ఏరియాల్లో ఓటర్ల రద్దీ

మిగతా కేంద్రాలకు భిన్నంగా మైనారిటీలు ఎక్కువగా ఉన్న షాహీన్​ బాగ్, జఫ్రాబాద్, శీలంపూర్, జామియా నగర్​ తదితర ఏరియాల్లోని పోలింగ్​ కేంద్రాల్లో ఓటర్ల రద్దీ ఎక్కువగా కనిపించింది. ఓటేసేందుకు జనం బారులు తీరారు. రాజధానిలో యాంటీ సీఏఏ ఆందోళనల నేపథ్యంలో పోలింగ్​ కేంద్రాల వద్ద సెక్యూరిటీని పటిష్టం చేశారు. సెన్సిటివ్​ జోన్లలో సెక్యూరిటీ సిబ్బంది కవాతు నిర్వహించారు. షాహీన్​ బాగ్​ ఆందోళనకారులను ప్రత్యేకంగా కలుసుకున్న ఎన్నికల అధికారులు.. ఈ ఎన్నికల్లో ఓటేయాలని, ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసన తెలపాలని కోరారు. షాహీన్​బాగ్​లోని 5 కేంద్రాలను సెన్సిటివ్​ జోన్​లో చేర్చి, తగు జాగ్రత్తలు తీసుకున్నట్లు అధికారులు చెప్పారు. పోలింగ్​ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకపోవడంతో అధికారులు
ఊపిరిపీల్చుకున్నారు.

ప్రముఖులు ఎక్కడ ఓటేశారు?

కేజ్రీవాల్​ – సివిల్​ లైన్స్​
హమీద్​ అన్సారీ (మాజీ ఉప రాష్ట్రపతి) –  నిర్మాణ్​ భవన్​
జైశంకర్​( ఫారెన్​ మినిస్టర్​) – తుగ్లక్​రోడ్డులోని ఎన్​ఎండీసీ స్కూలు
కేంద్రమంత్రి హర్షవర్థన్​ – కృష్ణానగర్​ రతన్​దేవి పబ్లిక్​ స్కూల్​
అనిల్​బైజల్​( ఢిల్లీ లెఫ్టినెంట్​ గవర్నర్​) –గ్రేటర్​ కైలాష్

70 అసెంబ్లీ సీట్లకుగాను 672 మంది కేండిడేట్లు పోటీపడ్డారు.  ఢిల్లీ అసెంబ్లీ పరిధిలో కోటీ 47 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. అధికార ఆమ్​ ఆద్మీపార్టీ, బీజేపీ మధ్య గట్టి పోటీ నెలకొన్నట్టు వార్తలు వచ్చాయి. ఈసారి కూడా ఇంతకుముందు మాదిరిగా కాంగ్రెస్ మూడో ప్లేస్​కే పరిమితం అవుతుందని పొలిటికల్​ ఎనలిస్ట్​లు అంచనావేస్తున్నారు.

ఈ రోజు ఢిల్లీ పోలింగ్​ డే. డెమొక్రసీ  అనే పండగలో ఎక్కువ సంఖ్యలో  పాల్గొనాలని, ఓటింగ్ లో​కొత్త రికార్డ్​ను  సృష్టించాలని  ఓటర్లను కోరుతున్నా. – ప్రధాని నరేంద్ర మోడీ

అబద్ధాలు చెప్పేవాళ్ల నుంచి, ఓటు బ్యాంక్​ పాలిటిక్స్​ చేసేవాళ్ల నుంచి దేశరాజధానికి “స్వేచ్ఛ”కల్పించాలని  ఢిల్లీ ఓటర్లను కోరుతున్నా.   – కేంద్ర హోంమంత్రి అమిత్​ షా

దేశం కలిసికట్టుగా ఉండాలంటే, ఢిల్లీ అభివృద్ధి సాధించాలంటే  మీరు వేసే ప్రతి ఒక్క ఓటూ ముఖ్యమే.  ఢిల్లీ బంగారు భవిష్యత్తును మీ ఓటుతో నిర్ణయిస్తారు.                       – బీజేపీ ప్రెసిడెంట్​ జేపీ నడ్డా

మరిన్ని వార్తల కోసం

Latest Updates