నన్ను ట్రోల్ చేస్తే.. మిమ్మల్ని డిలీట్ చేస్తా

ఇటీవల అమీర్ ఖాన్ కుమార్తె ఐరా క్లీనికల్ డిప్రెషన్ కు గురైందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఐరా ఆరోగ్యం గురించి తెలుసుకున్న సెలబ్రిటీలు, నెటిజన్లు ఆమె డిప్రెషన్ నుంచి కోరుకోవాలంటూ సోషల్ మీడియాలో ఆకాంక్షించారు. అదే సమయంలో పలువురు నెటిజన్లు ఆమెను ట్రోల్ చేశారు. ఈ ట్రోల్స్ పై ఐరా ఆగ్రహం వ్యక్తం చేసింది. నా ఆరోగ్యం గురించి నెగిటీవ్ గా కామెంట్ చేస్తే డిలీట్ చేస్తానని హెచ్చరించింది. అంతేకాదు నా మానసిక ఆరోగ్యం గురించి  ట్రోల్ చేస్తున్న వారి మెసేజ్ లను డిలీట్ చేయాలా అంటూ నెటిజన్లను కోరింది. అందుకు 56% మంది ఆమెకు మద్దతుపలికారు.

నేను నిరుత్సాహానికి గురయ్యాను . నాలుగు సంవత్సరాలకు పైగా ట్రీట్మెంట్ తీసుకున్న నేను ఇప్పుడు చాలా బాగాన్నా. ఇప్పుడు ఒక సంవత్సరానికి పైగా నా మెంటల్ హెల్త్ గురించి ఏదైనా చేయాలనుకున్నాను.  కాని ఏమి చేయాలో నాకు తెలియదు అంటూ 23ఏళ్ల ఐరా తెలిపింది.

 

 

Latest Updates