ఢిల్లీలో ఆప్ ఓట్లకు గండి!

ఢిల్లీ లోక్ సభ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి వ్యూహం లోపించినట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మే 12న పోలింగ్ జరిగే ఢిల్లీలో బీజేపీ,కాంగ్రెస్ లు సెలెబ్రిటీలను బరిలోకి దింపడంతో ఆమ్ఆద్మీ పార్టీకి ఇబ్బంది తప్పదని అభిప్రాయపడుతున్నారు. బీజేపీ క్రికెటర్ గౌతమ్ గంభీర్, గాయకుడు హన్స్ రాజ్ హన్స్ ను, కాంగ్రెస్ పార్టీ ఒలింపిక్ విజేత, బాక్సర్ విజేందర్ ను బరిలో దింపింది. ఆమ్ఆద్మీ పార్టీ ఈస్ట్ ఢిల్లీ నుంచి అతిషీ, సౌత్ ఢిల్లీ నుంచి రాఘవ్ చద్దాలను నిలబెట్టింది. ఈస్ట్ ఢిల్లీలో ఆప్ అభ్యర్థి అతిషీకి మంచి పేరుంది. ఢిల్లీలో గవర్నమెంట్ స్కూళ్లను ప్రైవేటుకు దీటుగా తీర్చిద్దిన, ప్రైవేటు స్కూళ్లలో అకౌంట్లు పారదర్శకంగా ఉండేలా తీసుకున్న చర్యల వెనుక అతిషీ శ్రమ ఉంది. అతిషీని మొదట ఢిల్లీలోపోటీ చేయాలని అడిగారు. అయితే గౌతమ్ గంభీర్ పోటీలో దిగినందున ఆమెకు ఈస్ట్ ఢిల్లీలో అవకాశం ఇచ్చారు. సౌత్ ఢిల్లీలో పోటీ చేస్తున్న రాఘవ్ చద్దా చార్టెర్డ్ అకౌంటెంట్, ఆప్ అధికార ప్రతినిధి. 2017లోఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడినా ఆప్34 శాతం ఓట్లు సాధించడంతో ఈ నియోజకవర్గంలో పట్టుందని తేలింది. సౌత్ ఢిల్లీలో కాంగ్రెస్ అభ్యర్థి విజేందర్ కు యువత, గుర్జర్లలో మంచి పాపులారిటీ ఉంది. గుర్జర్ కులానికి చెందిన రమేశ్ బిధూడి సౌత్ఢిల్లీలో బీజేపీ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. న్యూఢిల్లీలోక్ సభ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి గా వ్యాపారి బ్రజేష్ గోయల్ పోటీలో ఉన్నారు.

ఆప్ తప్పిదాలు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 70 స్థానాలకు గాను 67 స్థానాల్లో గెలిచిన ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్ర హోదా ఉద్యమాన్ని ఎత్తు కోవడంలో ఆలస్యం చేసింది. ఎన్నికల ప్రచారంలో వెనకబడటం ఆప్ రెండో మిస్టేక్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఆప్ ఎన్నికల ప్రచారం కోసం ఎలాంటి నినాదాన్ని గాని థీమ్ ను గాని ప్రకటిం చలేదు. వెస్ట్ ఢిల్లీ నుంచి బల్బీ ర్ సింగ్ ఘాకడ్, వాయవ్య ఢిల్లీ నుంచి గూగన్ సింగ్ ను బరిలోకి దింపింది. కాంగ్రెస్ తో పొత్తు కుదిరితే వెస్ట్ఢిల్లీ సీటును ఆ పార్టీకి ఇవ్వాలని మొదట ఆలోచించింది. అయితే చివరకు బల్బీర్ టికెట్ ఇచ్చింది. బీజేపీ నుంచి పార్టీ ఫిరాయిం చిన గూగన్ సింగ్ ను వాయవ్యఢిల్లీ నుంచి బరిలోకి దింపడం ఆప్ కు మైనస్ అని విశ్లేషకులు అంటున్నారు. ఈ స్థానంలో బీజేపీ అభ్యర్థిగా గాయకుడు హన్స్ రాజ్ హన్స్ బరిలో ఉన్నారు.

Latest Updates