ఎమ్మెల్యేకు, అతని సోదరునికి కరోనా పాజిటివ్

ఢిల్లీలో కరోనా సోకిన మొదటి ప్రజాప్రతినిధి

కరోనావైరస్ దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. దాని బారినపడి ఇప్పటికే దేశవ్యాప్తంగా 1223 మంది చనిపోయారు. దాదాపు 37 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా వైరస్ బారినపడి జాతీయరాజధాని ఢిల్లీ కూడా ఇబ్బందులు పడుతోంది. అక్కడ 3738 పాజిటివ్ కేసులు నమోదుకాగా.. 61 మంది చనిపోయారు. తాజాగా ఢిల్లీలో ఒక ఎమ్మెల్యే కూడా కరోనా బారిన పడ్డారు. కరోల్ భాగ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఆప్ ఎమ్మెల్యే విశేష్ రవికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఆయనతో పాటు ఆయన సోదరునికి కూడా కరోనావైరస్ సోకింది. రవికి కొంత అనుమానం ఉండటంతో బుధవారం కరోనా పరీక్షల కోసం శాంపిల్ ఇచ్చాడు. ఆ శాంపిల్లో అతనికి కరోనా సోకినట్లు కన్ఫర్మ్ అయింది. అయితే రవిలో మాత్రం ఇప్పటివరకు ఎటువంటి కరోనా లక్షణాలు కనిపించలేదు. కరోనా నిర్ధారణ కావడంతో రవి స్వీయ నిర్భందంలో ఉన్నారు.

రవి ఆ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా పనిచేయడం ఇది మూడవసారి. మరో ముఖ్య విషయమేంటంటే.. జాతీయ రాజధాని ఢిల్లీలో కరోనా సోకిన మొదటి ప్రజా ప్రతినిధి రవి కావడం గమనార్హం.

For More News..

350 కిలోమీటర్లు సైకిల్ తొక్కి చనిపోయిన వలస కార్మికుడు

నదిలో శవమై తేలిన చీఫ్ ఎడిటర్

పాక్ కాల్పుల ఉల్లంఘన.. ఇద్దరు భారత సైనికులు మృతి

Latest Updates