ఆప్ నుంచి ట్రాన్స్ జెండర్ పోటీ

ఉత్తర ప్రదేశ్  లోని అలహాబాద్ లోక్ సభ స్థానానికి ఆప్ నుంచి మొదటి సారి ట్రాన్స్ జెండర్ మహిళ భవానీ నాథ్ వాల్మీకి పోటీ చేస్తున్నారు. అలహాబాద్ నుంచి బీజేపీ తరపున రీఠా బహుగుణ జోషి, ఎస్సీ-బీఎస్పీ కూటమి నుంచి రాజేంద్ర ప్రతాప్ సింగ్  పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా భవానీ నాథ్ వాల్మీకీ మాట్లాడుతూ.. ‘ సమాజంలో మార్పు కోసమే నేను రాజకీయాల్లోకి వచ్చా. రాజకీయాల్లోకి రాకముందు చాలా పార్టీలతో కలిసి మాట్లాడా? కానీ ఎవరూ నా మాటలు వినలేదు. నన్ను పార్టీలోకి ఆహ్వానించలేదు. నా సిద్ధాంతాలు, ఆలోచనలు నచ్చడంతో  ఆప్ అలహాబాద్ టికెట్ ఇచ్చింది. సమాజంలో మార్పుకోసం కృషి చేస్తా..ట్రాన్స్ జెండర్ హక్కుల కోసం పోరాడతా.‘ అని అన్నారు.

Latest Updates