గోవా ప్రజలకు రెండు పౌరసత్వాలు ఇప్పిస్తాం: ఆమ్ ఆద్మీ

గోవాలో బహుల పౌరసత్వం డిమాండ్ ను తెరమీదకు తీసుకొచ్చింది ఆమ్ ఆద్మీ పార్టీ. మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కన్వినర్ ఎల్విస్ గోమ్స్ మీడియాతో మాట్లాడారు. దాదాపు 16వ శతాబ్దం నుంచి  పోర్చుగ్రీసు వారు గోవాలో నివసిస్తున్నారని అన్నారు. వీరు నాలుగు దశాబ్ధాలుగా బహుల పౌరసత్వంపై పోరాడుతున్నారని చెప్పారు. అయితే వీరికి బహుల పౌరసత్వం పొందేందుకు భారత పౌరసత్వం అనుమతులు ఇవ్వడం లేదని చెప్పారు. ఈ ఎంపీ ఎన్నికలలో గోవాలోని రెండు లోక్ సభ సీట్లలో ఆప్ గెలిస్తే.. బహుల పౌరసత్వంపై పోరాడుతామని తెలిపారు.

గోవాలో బహుల పౌరసత్వం ఎందుకు డిమాండ్ లో ఉంది:
వ్యాపార నిమిత్తం 15వ శతాబ్ధంలో సముద్ర మార్గం ద్వారా పోర్చుగ్రీసు వారు కెరళాకు  చేరుకున్నారు. ఆతర్వాత కొద్ది కాలానికి గోవాలో స్థిర పడ్డారు. అప్పటి నుంచి గోవా పోర్చుగ్రీసువారి చేతిలో ఉంది. భారత దేశానికి స్వాతంత్యం వచ్చినా.. గోవాను మాత్రం భారత్ లో కలవనీయలేదు. ప్రపంచ దేశాలు ఎన్ని చెప్పినాకానీ పోర్చుగ్రీసు వినలేదు. చివరికి..  1961 లో భారత్ సైనిక చర్య చేసి గోవాను భారత్ లో కలిపేసుకుంది.

16వ శతాబ్దం నుంచి గోవాలో ఉన్న పోర్చుగ్రీస్ వాళ్లు.. స్థానిక భారతీయులను పెండ్లి చేసుకుని మతాన్ని మార్చారు. వాళ్లకు పుట్టిన పిల్లలను పోర్చుగ్రీసు పౌరులుగా ప్రకటించారు. అయితే 1961 లో గోవా.. భారత్ లో భాగమైంది..అయితే అప్పటి వరకు అక్కడ ఉన్న పోర్చుగ్రీసు వాళ్లు గోవాలోనే ఉండి పోయారు. వాళ్లకు రెండు పౌరసత్వాలు కావాలని అందుకు అనుమతులనివ్వాలని భారత ప్రభుత్వాన్ని కోరారు..  అందుకు ఇండియా నిరాకరించింది. ప్రస్తుతం లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో కేజ్రీవాల్ సారథ్యంలోని ఆమ్ ఆద్మీ పార్టీ బహుల పౌరసత్వానికి పోరాటం చేస్తామని చెప్పింది.

Latest Updates