ఎమ్మెల్యే అల్కా లంబాపై అనర్హత వేటు

ఆమ్ ఆద్మీ పార్టీ కి ఇటీవలే గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరిన అల్కా లంబాపై అనర్హత వేటుపడింది. ఢిల్లీ అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయల్ ప్రకటించారు. ఆప్ తరపున చాందినీ చౌక్ ఎమ్మెల్యేగా గెలుపొందిన అల్కా లంబాపై అనర్హత వేటు వేయాలని కోరుతూ ఆ పార్టీ ఎమ్మెల్యే సౌరభ్ భరద్వాజ్ పిటిషన్ తో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. రెండు వారాల క్రితం ‘ఆప్’ సభ్యత్వానికి అల్కా లంబా రాజీనామా చేస్తూ ఓ ట్వీట్ చేశారు.

ఆప్ లో చేరడానికి ముందు కాంగ్రెస్ పార్టీలో అల్కా లాంబా  ఉన్నారు. 2014 డిసెంబర్ లో కాంగ్రెస్ ను వీడి ఆప్ లో చేరారు. తిరిగి మళ్లీ కాంగ్రెస్ గూటికే చేరారు.

Latest Updates