ఆరోగ్యసేతు యాప్‌ ఉంటేనే ఢిల్లీలోకి

  • సిఫారసు లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోకి రావాలంటే ఆరోగ్య సేతు యాప్‌ కంపల్సరీగా డౌన్‌లోడ్‌ చేసుకునేలా కఠిన నిబంధనలు తీసుకురావాలని ఢిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌‌ అనిల్‌ బైజల్‌ అన్నారు. కరోనాపై అధికారులతో రివ్యూ మీటింగ్‌ సందర్భంగా అనిల్‌ బైజల్‌ ఈ సిఫార్సు చేసినట్లు అధికారులు చెప్పారు. ఈ మేరకు ప్రభుత్వానికి సలహా ఇవ్వాలని డిసీజ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌‌ సుర్జిత్‌ కుమార్‌‌ సింగ్‌ను గవర్నర్‌‌ ఆదేశించారు. దీనిపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోనప్పటికీ, ప్రభుత్వం కూడా దీన్ని అమలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది. దీని ద్వారానైనా జనాలు అప్రమత్తమై కరోనా వ్యాప్తిని అరికట్టగలమని భావిస్తున్నట్లు తెలుస్తోంది. కరోనా అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఆరోగ్య సేతు యాప్‌ను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా ఉన్న కేసులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలు తదితర అంశాలు దీంట్లో ఉంటాయి. ఇప్పటి వరకు దాదాపు 75 మిలియన్ల మంది యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్లు అధికారులు చెప్పారు.

Latest Updates