ఆర్తి అగర్వాల్ బయోపిక్ 

సినీ ఇండస్ట్రీలో బయోపిక్‌‌ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే క్రీడా, రాజకీయ , సినీ పరిశ్రమ లకి సంబంధించిన పలువురు సెలెబ్రిటీల జీవితాలు సినిమాలుగా వచ్చాయి. కొన్ని రెడీ అవుతున్నాయి. ఇప్పుడు ఆర్తి అగర్వాల్ బయోపిక్‌‌కి కూడా ఏర్పాట్లు జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘నువ్వు నాకు నచ్చావ్’ మూవీతో ఎంట్రీ ఇచ్చి .. మొదటి సినిమాతోనే హిట్ కొట్టింది ఆర్తి. కన్ను మూసి తెరిచేలోగా చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున లాంటి స్టార్ హీరోల సరసన చాన్సులు సంపాదించి బిజీ అయిపోయింది. అతి తక్కువ సమయంలోనే అగ్ర హీరోలందరితో కలిసి నటించిన ఘనత ఆమెది. అయితే ఎంత వేగంగా పేరు తెచ్చుకుందో అంతే వేగంగా కనుమరుగైపోయింది.

లవ్‌‌ ఫెయిల్యూర్, సూసైడ్ అటెంప్ట్ వంటి విషయాలతో ఆమె గ్రాఫ్ అమాంతం పడింది. మెల్లగా మళ్లీ నిలదొక్కుకోవాలని ప్రయత్నించినా వెయిట్ సమస్యలుఇబ్బంది పెట్టాయి. దాంతో లైపో చేయించుకోవడానికి ట్రై చేయడం, ఆపరేషన్‌‌ వికటించి ఆమె చనిపోవడం అన్నీ వెంటవెంటనే జరిగిపోయాయి. ఇన్ని ఆటుపోట్లు ఉన్న ఆమె జీవితాన్ని సెల్యు లాయిడ్‌‌కి ఎక్కించేందుకు ఓ దర్శకుడు ప్రయత్నాలు చేస్తున్నాడట. ఇంత బరువైన పాత్రను కీర్తి సురేష్ చేస్తే బాగుంటుందని అతడు ఫీలవుతున్నాడని కూడా అంటున్నారు. పూర్తి వివరాలు ఎప్పుడు బైటికి వస్తాయా అని ఆర్తిని అభిమానించే వారంతా ఎదురు చూస్తున్నారు.

Latest Updates