హైదరాబాద్: ఆసరా పెన్షన్లలో భారీ స్కాం

హైదరాబాద్: వృద్ధుల పెన్షన్ కాజేసిన వారిని అరెస్ట్ చేశారు సీసీఎస్ సైబర్ క్రైమ్ పోలీసులు. హైదరాబాద్ కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదుతో విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ ఓల్డ్ సిటీలో జరిగింది. ఓల్డ్ సిటీకి చెందిన ఇమ్రాన్ , సోహెల్ , మోసిన్ లు.. అస్లాం  అనే ప్రభుత్వ ఉద్యోగి సహాయంతో మూడు నెలల నుంచి 250మంది ముసలోల్లకు చెందిన పెన్షన్ పైసలను కాజేశారు. విషయాన్ని గ్రహించిన హైదరాబాద్ కలెక్టర్ పోలీసులకు ఫిర్యాదు ఇవ్వడంతో నిందితులను అరెస్ట్ చేశారు. మరికొందరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

Latest Updates