కరోనాకు 2 ఇన్​ 1 మెడిసిన్! త్వరలో మార్కెట్లోకి సరికొత్త మందు

మందుగా లేదా వ్యాక్సిన్​గా పనిచేసే యాంటీబాడీ
ఏబీ8ను తయారు చేసిన పిట్స్ బర్గ్​ వర్సిటీ సైంటిస్టులు
పది వేల కోట్లలో ఒకే ఒక్కటి
మామూలు యాంటీబాడీతో పోలిస్తే పది రెట్లు చిన్న సైజు

టొరంటో: కరోనా అంతు చూసేందుకు సరికొత్త మందొస్తోంది. వేల కోట్లలో ఒకే ఒక్కటిగా ఓ చిన్న యాంటీబాడీ తాను స్పెషల్​ అని నిరూపించింది. ఆ మందును అమెరికాలోని పిట్స్​బర్గ్​ యూనివర్సిటీ సైంటిస్టులు గుర్తించారు. వాళ్లకు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్​ నార్త్​ కరోలినా, యూనివర్సిటీ ఆఫ్​ టెక్సస్​ మెడికల్​ బ్రాంచ్​, కెనడాలోని యూనివర్సిటీ ఆఫ్​ బ్రిటీష్​ కొలంబియా, యూనివర్సిటీ ఆఫ్​ సాస్కచివాన్​ సైంటిస్టులు తోడుగా నిలిచారు. అందులో యూనివర్సిటీ ఆఫ్​ బ్రిటీష్​ కొలంబియా యూనివర్సిటీలో సైంటిస్ట్, ​మన దేశానికి చెందిన శ్రీరామ్​ సుబ్రమణియం కూడా ఉన్నారు. వాళ్లు కనిపెట్టిన ఆ మందు పేరు ఏబీ8 అనే ఒక యాంటీ బాడీ.

కరోనా ప్రొటీన్​ను ఎరగా వేసి

ఈ స్పెషల్​ ఏబీ8 యాంటీ బాడీని కనిపెట్టేందుకు కరోనా వైరస్​లోని స్పైక్​ ప్రొటీన్​నే ఎరగా వేశారు సైంటిస్టులు. దాంతోనే మన రక్తంలోని యాంటీబాడీలైన ఇమ్యునోగ్లోబ్యులిన్​లలో వేరియబుల్ హెవీ చెయిన్​ (వీహెచ్​) డొమెయిన్​ను గుర్తించారు. పది వేల కుపైగా క్యాండిడేట్లను పరిశీలించి వీహెచ్​ పనితీరు బాగుందని తేల్చారు. తర్వాత ఇమ్యునోగ్లోబ్యులిన్ల నుంచి వీహెచ్​ డొమెయిన్​ను తీసుకున్నారు. దానిని సెపరేట్​ చేసిన ఇమ్యునోగ్లోబ్యులిన్​ తోకకు తగిలించి ఏబీ8 అనే సరికొత్త ఫుల్​సైజ్​ యాంటీబాడీకి జీవం పోశారు. మామూలు యాంటీబాడీలతో పోలిస్తే ఈ ఏబీ8 యాంటీబాడీ పది రెట్లు చిన్నగా ఉంటుందట.

స్పీడ్​గా మందు పనితీరు

చిన్నగా ఉండడమే ఈ యాంటీబాడీ స్పెషలా? అంటే కానే కాదు. దానికి ఇంకా ఎన్నో ప్రత్యేకతలూ ఉన్నాయి. దీనిని టూ ఇన్​ వన్​గా వాడుకోవచ్చంటున్నారు సైంటిస్టులు. కరోనా వస్తే మందుగానూ, కరోనా రాకుండా అడ్డుకునేందుకు వ్యాక్సిన్​గానూ దీనిని వేసుకోవచ్చని చెబుతున్నారు. అంతేకాదు, చాలా చిన్నగా ఉండే దీని సైజు కూడా మందు వేయడంలో ప్రత్యేకతను చూపిస్తుందట. మామూలుగా వ్యాక్సిన్లను ఇంజెక్షన్ల ద్వారానే ఇస్తుంటారు. కానీ, ఏబీ8ను ఆస్తమా మందులాగా పీల్చుకోవచ్చట. లేదంటే ప్యాచ్​తో చర్మం ద్వారానైనా ఎక్కించొచ్చని అంటున్నారు. దాని వల్ల ఇంజెక్షన్​ నొప్పి నుంచి తప్పించుకునే అవకాశం దొరకడంతో పాటు.. చాలా వేగంగా మందు యాక్టివిటీ పెరిగే అవకాశం ఉందని హామీ ఇస్తున్నారు. చిన్న సైజు ట్రయల్స్​లో ఇది మంచి ఫలితాలనిచ్చిందని సైంటిస్టులు చెబుతున్నారు. పిట్స్​బర్గ్​ యూనివర్సిటీ సపోర్ట్​తో కొత్తగా ఏర్పాటు చేసిన ‘ఎబౌండ్​ బయో’ అనే కంపెనీ ప్రపంచవ్యాప్తంగా ఈ ఏబీ8 యాంటీబాడీలను తయారు చేయనుంది.

For More News..

వచ్చే జనవరిలో శశికళ రిలీజ్!

డిజిటల్ గోల్డ్‌పై జనాల ఆసక్తి..

ఇకనుంచి బ్యాంకుకు వెళ్లక్కర్లేదు.. ఉద్యోగులే మీ ఇంటికొస్తరు..

Latest Updates