న్యాయ వ్యవస్థపై రాహుల్ గాంధీ నీచ రాజకీయం

ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తి బదిలీపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలకు బీజేపీ కౌంటరిచ్చింది. న్యాయ వ్యవస్థపైనా రాజకీయాలు చేయడం దారుణమని మండిపడింది. రాహుల్ గాంధీ నీచ రాజకీయాలు చేస్తున్నారని కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ ఆరోపించారు. న్యాయమూర్తుల బదిలీలు ఎలా జరుగుతాయో రాహుల్ కు తెలియదా అని నక్వీ ప్రశ్నించారు. దీంతో పాటు… కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ కూడా వివరణ ఇచ్చారు. ఫిబ్రవరి 12నే జస్టిస్ మురళీధర్ బదిలీ నిర్ణయం రవిశంకర్ ట్వీట్ చేశారు. సీజేఐ నేతృత్వంలోని సుప్రీంకోర్టు కొలీజియమే బదిలీ నిర్ణయం తీసుకుందని చెప్పారు.ఇందుకు జడ్జీ మురళీధర్ అంగీకారం కూడా తీసుకున్నామన్నారు రవిశంకర్ ప్రసాద్.

Latest Updates