ABCD ఫస్ట్ లుక్ కి టైం ఫిక్స్

అల్లు శిరీష్ హీరోగా కొత్త డైరెక్టర్ సంజీవ్ రెడ్డి తెరకెక్కిస్తున్న సినిమా ABCD (అమెరికన్‌ బోర్న్‌ కన్‌ఫ్యూజ్డ్‌ దేశీ). మలయాళ ABCD సినిమాను తెలుగులోనూ ఇదే పేరుతో రూపొందిస్తున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ డిసెంబర్-28న రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని ..ఇవాళ ట్విట్టర్ లో తెలుపుతూ.. ఓ పిక్ ను పోస్ట్ చేశాడు హీరో శిరీష్. పోస్టర్ చూస్తుంటే శిరీష్ కి హిట్ కన్ఫమ్ అంటున్నారు ఫ్యాన్స్. హీరో ఫేస్ కనిపించకుండా వెరైటీగా చూపించారు. క్రేజీ బ్యానర్ సురేష్ ప్రొడక్షన్ లో ఈ మూవీ రానుండటంతో ..ABCDపై అభిమానుల్లో అంచానాలు బాగానే ఉన్నాయి.

అమెరికా నుండి విహారయాత్ర‌కి ఇండియాకి వ‌చ్చిన ఓ మిడిల్ క్లాస్ అబ్బాయి త‌న జీవితంలో ఎదురైన సంఘ‌ట‌ల‌ని ఎదుర్కొని, ఎలా ముందుకు వెళ్లాడ‌నేది సినిమా స్టోరీ. ‘పెళ్లిచూపులు’ నిర్మాత యశ్‌ రంగినేని, మధుర’ శ్రీధర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి కన్నడ మ్యూజిక్‌ డైరెక్టర్‌ జుడా స్యాండీ మ్యూజిక్. శిరీష్ సరసన కృష్ణార్జున యుద్ధం ఫేం రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా.. ఫిబ్ర‌వరి 8, 2019న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించింది యూనిట్.

Posted in Uncategorized

Latest Updates