కలాం చెప్పిన అద్భుతమైన మాట : ఫెయిల్యూర్​ లీడర్​ది.. సక్సెస్​ టీమ్​ది

abdul-kalam-great-words-about-leadership-and-success-283579-2

విక్రమ్ ల్యాండర్​ జాబిల్లిపై స్మూత్​గా ల్యాండ్​ కాలేకపోయింది. ఇది ఫెయిల్యూర్‌‌ కాదని సైంటిస్టులు అంటున్నారు. అసలు, ఫెయిల్యూర్‌‌ అనే మాట గురించి  మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం ఏమన్నారు?

1979లో మనదేశ తొలి శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎల్వీ3) ప్రయోగం జరిగింది. అది కక్ష్యలోకి చేరలేదు. అప్పుడు ఆ ప్రాజెక్టు డైరెక్టర్​గా అబ్దుల్ కలాం.. ఇస్రో చైర్మన్​గా ప్రొఫెసర్​ సతీశ్‌‌  ధావన్ ఉన్నారు.

2013లో ఆ ప్రయోగం గురించి అబ్దుల్ కలాం మాట్లాడుతూ వైఫల్యాన్ని ఎలా మేనేజ్‌‌ చేయాలో చెప్పారు. ‘‘అది 1979. నేను ప్రాజెక్ట్ డైరెక్టర్. శ్రీహరికోట లాంచ్ ప్యాడ్ పై ఎస్ఎల్వీ3 ఉంది. కౌంట్ డౌన్ మొదలైంది. సడన్‌‌గా కంప్యూటర్ కౌంట్​డౌన్‌‌ను ఆపేసింది. నేను మిషన్ డైరెక్టర్ ని. ఏదో ఒక నిర్ణయం నేనే తీసుకోవాలి. నిపుణులంతా  ముందుకే వెళ్లాలన్నారు. నేను కంప్యూటర్‌‌ను బైపాస్ చేసి.. రాకెట్​ను లాంచ్ చేశాను. రెండో స్టేజ్ అదుపు తప్పింది. పల్టీలు కొట్టింది. రాకెట్‌‌ బంగాళాఖాతంలో కూలిపోయింది.  కంప్యూటర్​ వార్నింగ్ ఇచ్చినా రాకెట్‌‌ను లాంచ్ చేయాలని నిర్ణయం​ తీసుకుంది నేనే. తొలిసారి ఓడిపోయా. సక్సెస్‌‌ను  మేనేజ్ చేయగలను. కానీ ఓటమిని ఎలా..? విమర్శలు వస్తాయని తెలిసినా ఇస్రో చైర్మన్ సతీశ్‌‌​ ధావన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ‘‘డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు మేము ఫెయిల్​ అయ్యాం. నేను మా టెక్నాలజిస్టులు, సైంటిస్టులు, స్టాఫ్​కు పూర్తి మద్దతునిస్తున్నా. వచ్చే ఏడాది వారు సక్సెస్ అవుతారు” అని సతీశ్‌‌ ధావన్ చెప్పారు. మొత్తం తప్పును తనపై వేసుకున్నారు. ఆ తర్వాత ఏడాది 1980 జులై 18న మా టీమ్​ రోహిణి ఆర్​ఎస్​1ను సక్సెస్ ఫుల్​గా ప్రయోగించింది. అప్పుడు సతీశ్‌‌​ధావన్​ నన్ను పిలిచి మీడియాతో మాట్లాడాలన్నారు.  ఓటమి​ ఎదురైనప్పుడు ఒక ఆర్గనైజేషన్​ లీడర్ దానికి పూర్తి బాధ్యతను తీసుకోవాలి. అదే సక్సెస్​ వచ్చినప్పుడు అతడు దానిని తన టీమ్​ మొత్తానికి ఇవ్వాలి. దీనిని నేను  పుస్తకాల్లో చదివి నేర్చుకోలేదు. అనుభవపూర్వకంగా వచ్చింది’’ అని కలాం చెప్పారు.

Latest Updates