వీఆర్వో వ్యవస్థ రద్దు: ప్రశ్నార్ధకంగా 7 వేల మంది భవిష్యత్

వీఆర్వో వ్యవస్థ రద్దుతో అందులో పనిచేస్తున్న 7 వేల మంది భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారింది. వారిని ఏ డిపార్ట్ మెంట్ లో ఎడ్జెట్ చేస్తారో క్లారిటీ ఇవ్వలేదు సర్కార్. సంబంధం లేని పనులు చేస్తూ ఇబ్బందులు పడుతున్నారు వీఆర్వోలు. గతంలో రెవెన్యూ శాఖలో కీలకపాత్ర పోషించిన వీఆర్ఓల భవిష్యత్ గందరగోళంగా మారింది. వీఆర్వోలు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్న పేరుతో గత ఏడాది సెప్టెంబర్ 8న వీఆర్వో వ్యవస్థను రద్దు చేసింది ప్రభుత్వం. ఇప్పటి వరకు వేరే శాఖల్లో అడ్జస్ట్ చేయకపోవడంతో వీళ్ల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. రోజూ ఉదయం తహసీల్దార్ ఆఫీసులకు వెళ్లడం వాళ్లు ఏ డ్యూటీ వేస్తే ఆ డ్యూటీకి పోవడమే అలవాటుగా మారింది. ప్రాపర్టీ సర్వే, కస్టమ్ మిల్లింగ్ పర్యవేక్షణతో పాటు కల్యాణలక్ష్మి అప్లికేషన్లు, క్యాస్ట్,  ఇన్ కమ్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్.. ఇలా అన్ని పనులూ చేయాల్సి వస్తోంది. కొందరిని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు పంపడంతో కమిషనర్లకు రిపోర్ట్ చేస్తున్నారు.

భూరికార్డుల ప్రక్షాళన తర్వాత రికార్డులన్నీ డిజిటలైజ్ చేయడం, కాస్తు కాలమ్ తొలగించడంతో భూపరిపాలనలో ఇక వీఆర్వోల అవసరం లేదనే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. దీంతో  రెవెన్యూ నుంచి పక్కనపెట్టిన వీఆర్వోలందరినీ ఇతర శాఖల్లో అడ్జస్ట్ చేయాలని భావించింది. వీళ్లందరికీ జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టింగ్ ఇవ్వనున్నట్లు ఉన్నతాధికారులు చెప్పారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో 2వేల మందిని వార్డు ఆఫీసర్లుగా నియమించాలనే ప్రపోజల్స్ వచ్చాయి. సుమారు 18 డిపార్ట్మెంట్ల నుంచి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ పోస్టుల వివరాలను తీసుకున్న ఉన్నతాధికారులు ఇప్పటివరకు వీఆర్వోలను ఎక్కడ సర్దుబాటు చేయలేదు.అగ్రికల్చర్, ఇరిగేషన్, పంచాయతీరాజ్, మున్సిపల్ డిపార్ట్మెంట్లలోనే అడ్జస్ట్ చేస్తామన్నారు.  పేరు మార్చి రెవెన్యూలోనే కొనసాగిస్తామన్నారు. దీనిపై  ఉన్నతాధికారుల నుంచి ఇప్పటివరకు క్లారిటీ రాలేదు.

తమతో జిల్లాకో తరహా డ్యూటీలు చేయిస్తున్నారని ఆరోపిస్తున్నారు వీఆర్వోల సంఘం నేతలు. తమలో అర్హత కలిగినవారికి ప్రభుత్వం పదోన్నతులు కల్పించాలంటున్నారు.50 ఏళ్లు నిండిన వారికి, అనారోగ్యంతో బాధపడుతున్న వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరుతున్నారు. ఇతర జిల్లాల్లో పనిచేస్తున్న వారిని సొంత జిల్లాలకు బదిలీ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు.ఇతర శాఖలకు వెళ్లాలనుకునే వారికి ఆప్షన్ ఇచ్చి… సర్వీస్ ప్రొటెక్షన్, పే ప్రొటెక్షన్ చూపించాలంటున్నారు వీఆర్వో సంఘం నేతలు.

 

Latest Updates