స్కూళ్ల రీఓపెన్ ‌పై 27న నిర్ణయం..?

27న డీఈవోలతో ఎడ్యుకేషన్ మినిస్టర్ మీటింగ్

స్కూళ్ల రీఓపెన్ సహా 12 అంశాలపై సమీక్ష

హైదరాబాద్, వెలుగు: వచ్చేనెల 1 నుంచి బడులు స్టార్ట్ కానుండటంతో ఏర్పాట్లపై సర్కారు పెద్దలు దృష్టిపెట్టారు. ఈ నెల 25లోగా అన్ని బడులు, హాస్టళ్లు ఓపెన్ చేసేందుకు రెడీగా ఉంచాలని ప్రభుత్వం ఇదివరకే ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు ఏ మేరకు జరిగాయని తెలుసుకునేందుకు ఈనెల 27న అన్ని జిల్లాల డీఈవోలు, విద్యాశాఖ అధికారులతో ఎడ్యుకేషన్ మినిస్టర్ సబితా ఇంద్రారెడ్డి సమీక్ష నిర్వహించనున్నారు. హైదరాబాద్‌‌‌‌‌‌‌‌లోని ఎంసీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హెచ్ఆర్డీలో జరిగే సమావేశంలో స్కూళ్ల రీఓపెన్‌‌‌‌‌‌‌‌పై ప్రిపరేషన్‌‌‌‌‌‌‌‌తో సహా 12 అంశాలపై చర్చించనున్నారు. అకడమిక్ క్యాలెండర్, డిజిటల్ క్లాసులు, టీచర్ల ప్రమోషన్లు, మిడ్‌‌‌‌‌‌‌‌డే మీల్స్, ఎన్‌‌‌‌‌‌‌‌రోల్‌‌‌‌‌‌‌‌మెంట్, బడులకు మిషన్ భగీరథ నీళ్ల కనెక్షన్, ఓఎస్ఎస్సీ, సీడబ్ల్యూఎస్ఎన్ సర్వే, స్టూడెంట్స్ బ్యాంక్ అకౌంట్ల ఓపెన్ వంటి అంశాలను ఎజెండాలో పెట్టారు.

మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్‌‌తో నేడు రివ్యూ

బడుల ప్రారంభంపై మోడల్ స్కూళ్లలో చేస్తున్న ఏర్పాట్లపై స్కూల్ ఎడ్యుకేషన్ అడిషనల్ డైరెక్టర్ సత్యనారాయణ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించనున్నారు. స్టేట్‌‌‌‌‌‌‌‌లోని మోడల్ స్కూళ్ల ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌, ఇన్‌‌‌‌‌‌‌‌చార్జ్ ప్రిన్సిపాల్స్‌‌‌‌‌‌‌‌తో వర్చువల్‌‌గా చర్చించనున్నారు. బడులు, హాస్టళ్లు ప్రారంభిస్తున్నందున తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సత్యనారాయణరెడ్డి సూచనలు ఇవ్వనున్నారు.

ఇవి కూడా చదవండి..

రైతులు పంటలను మార్కెట్​లోనే అమ్ముకోవాలె

ప్రాణహిత ప్రవాహం తగ్గింది.. యాసంగికి నీళ్లెట్ల..?

పీహెచ్‌‌‌‌సీ నుంచే పెద్ద డాక్టర్‌‌‌‌కు చూపెట్టుకోవచ్చు

 

Latest Updates