
హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ సమ్మెను ముందుండి నడిపించిన ఆర్టీసీ జేఏసీ నేత అశ్వత్థామరెడ్డికి ఆర్టీసీ యాజమాన్యం గురువారం షోకాజ్‌నోటీసులు జారీ చేసింది. అధికారులకు సమాచారం ఇవ్వకుండా, పర్మిషన్ తీసుకోకుండా ఉద్యోగానికి ఆబ్సెంట్ కావడంపై వివరణ ఇవ్వాలని ఆర్టీసీ ఎంజీబీఎస్ కస్టమర్ రిలేషన్ మేనేజర్ఆదేశించారు. డిసెంబర్6, 2019 నుంచి 2021, జనవరి 6 వరకు డ్యూటీకి రాలేదని అధికారులు చెప్పారు. షోకాజ్ నోటీసుపై ఏడు రోజుల్లో పర్సనల్‌గా వచ్చి వివరణ ఇవ్వాలని, లేదంటే ఉద్యోగం నుంచి పర్మినెంట్‌గా తీసేస్తామని నోటీసులో పేర్కొన్నారు.