ACBకి దొరికిన సూపరింటెండెంట్ ఇంజనీర్

రెండు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా బుక్కయ్యాడు సూపరింటెండెంట్ ఇంజనీర్ ప్రదీప్ చంద్ర. తెలంగాణ అర్బన్ ఫైనాన్స్ డెవలప్ మెంట్ కార్పోరేషన్ లో SEగా పనిచేస్తున్న ప్రవీణ్ చంద్ర.. వనపర్తికి చెందిన కాంతారెడ్డి అనే కాంట్రాక్టర్ ను లంచం డిమాండ్ చేశారు. పెండింగ్ లో ఉన్న కోటి 32 లక్షల బిల్ మంజూరు చేయాలంటే రూ.3 లక్షలు లంచం ఇవ్వాలని అడిగారు.

చర్చల తర్వాత రూ.2 లక్షలకు ఒప్పందం కుదిరింది. డబ్బు రెడీ చేసిన కాంట్రాక్టర్.. ఆ తర్వాత ఏసీబీకి సమాచారం ఇచ్చారు. ఈ మేరకు వారు.. పథకం రూపొందించారు. మాసాబ్ ట్యాంక్ లోని ఆఫీస్ లోనే కాంట్రాక్టర్ నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటుండగా.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు ACB అధికారులు.

Posted in Uncategorized

Latest Updates